Asianet News TeluguAsianet News Telugu

బరువు తగ్గడానికి చపాతీలా..? కొర్రలా?

ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్స్ కి అలవాటు పడి.. పని ఒత్తిడి, నిద్రలేమి ఇలా తదితర కారణాల వల్ల..  ఎంత తింటున్నామో, ఏమి తింటున్నామో తెలీకుండానే చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. 

Rice Vs Chapati: Which is healthier for weight loss?
Author
Hyderabad, First Published Jul 1, 2019, 4:37 PM IST

ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్స్ కి అలవాటు పడి.. పని ఒత్తిడి, నిద్రలేమి ఇలా తదితర కారణాల వల్ల..  ఎంత తింటున్నామో, ఏమి తింటున్నామో తెలీకుండానే చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. పొట్ట ముందుకు వచ్చి పడితేగానీ.. బరువు తగ్గాలనే ఆలోచన చాలామందికి రావడం లేదు.  బరువు తగ్గాలి అన్న ఆలోచన రాగానే ముందు రోజూ తినే తండి మానేస్తారు. 

ఆ స్థానంలోకి చపాతీలు, రోటీలు, కొర్రలు లాంటి వాటని ఆహారంలోకి చేర్చేస్తున్నారు. ఇది మంచి పద్దతే అయితే... వీటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది అన్న విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చపాతీలు, గోధుమ నూక , జొన్న రొట్టెలు, కొర్ర బియ్యం, బ్రౌన్‌ రైస్‌ ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే, తగిన పరిమాణంలో తింటే.. బరువును నియంత్రణలో ఉంచు కోవచ్చు. 

గోధుమ రొట్టెలు, ముడి బియ్యంకంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంస కృత్తులు, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. కాస్తంత తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. అయితే రొట్టెలు, ముడి బియ్యం, కొర్ర బియ్యం... ఏదైనాసరే వాటితో పాటు తీసుకునే కూర, పప్పు పరిమాణాన్ని బట్టి కూడా బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. 

ప్రతి ధాన్యంలో దానికే ప్రత్యేకమైన కొన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి ఒకే ధాన్యపు వంటకాన్ని రోజూ తినకుండా, అన్ని రకాల ధాన్యాలనూ తీసు కోవాలి. ఆకుకూరలనూ కాయగూరలనూ ఎక్కువగా తినడం మంచిది. వెన్న తీసిన పాలు, పెరుగు వినియోగించాలి. దీంతో పాటు శారీరక వ్యాయామం చేయాలి. తగినంత నిద్రపోవాలి. ఈ  జాగ్రత్తలు పాటిస్తే బరువు తగ్గడం తేలికవుతుంది. మనం ఎంచుకునే ఆహార విధానం పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేదై ఉండాలి. కేవలం బరువు తగ్గించినంత మాత్రాన సరిపోదు.

Follow Us:
Download App:
  • android
  • ios