ముక్కు ముఖం తెలియని వారితో ఒక మాట మాట్లాడటానికే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం. అలాంటిది.. ఊరు, పేరు ఏమీ తెలీకుండా అపరిచితులతో శృంగారంలో ఎవరైనా పాల్గొంటారా? సంవత్సరాలపాటు ప్రేమించిన వారితోనే శారీరకంగా కలిస్తేనే.. మోసం చేస్తున్న రోజులివి. అలాంటిది ఈ అపరిచిత శృంగారం కాన్సెప్ట్ ఏంటా అనుకుంటున్నారా..? ఇది ఒక ప్రాంతంలో ఆచారం. అపరిచితులతో శారీరకంగా కలిస్తే అదృష్టం కలిసి వస్తుందనేది వారి నమ్మకం.

ఈ వింత ఆచారం ఇండోనేషియాలో ఉంది. అక్కడ ఉండే జావా ద్వీపంలో కెముకస్ అనే పర్వతం ఉంది. అక్కడ ప్రత్యేకంగా పోన్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ లో భాగంగా అపరిచితులతో శృంగారంలో పాల్గొంటే అదృష్టం కలిసి వస్తుందట. అప్పటికే పెళ్లి అయి ఉన్నవారు కూడా కొత్త వ్యక్తులో సెక్స్ చేయవచ్చని చెబుతున్నారు.

ఈ ఆచారం అక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. గునుంగ్ కెముకస్ దగ్గర యాత్రికులు వచ్చి కలుసుకుంటారు. అనంతరం ఒకరికి మరొకరు నచ్చితే శృంగారంలో పాల్గొంటారు. దీనికి కూడా కొన్ని పద్దతులు ఉన్నాయట. ఉదయాన్నే స్నానం చేసి పూజలు నిర్వహించి ఆ  తర్వాత నచ్చిన భాగస్వామికి కోసం వెతుకుతారట.

నచ్చిన వారు దొరికితే.. రాత్రి సమయంలో అక్కడ శృంగారంలో పాల్గొంటారట. ఇలా పాల్గొన్న 35రోజులకి మళ్లీ కలుస్తారట. ఇలా ఏడుసార్లు చేస్తే.. వారికి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. పురుషులు ఈ కొండకు ఎక్కువగా తరలిరావడంతో.. ఆ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు పాగా వేస్తున్నారట. వాళ్ల అదృష్టాన్ని వీళ్లు క్యాష్ చేసుకుంటున్నారనమాట.