Asianet News TeluguAsianet News Telugu

పిల్లలు ఫోన్, ఆన్ లైన్ గేమ్స్ కి బానిసలు గా మారితే ఏం జరుగుతుందో తెలుసా?

అందరి చేతుల్లో ఫోన్, ఇంటర్నెట్ సౌలభ్యం ఉండటంతో... వీటి రీచ్ కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో.. పిల్లలకు ఆ గేమ్స్ కి బానిసలుగా మారుతున్నారు. మరి మీ పిల్లలు కూడా ఫోన్, గేమ్స్ కి బానిసలుగా మారారా..? అది తెలుసుకోవడమోలాగో ఇప్పుడు చూద్దాం..

Online Gaming Addiction: What Happens When Kids Are Addicted To Online Games
Author
Hyderabad, First Published Jun 8, 2022, 2:49 PM IST

ఈ రోజుల్లో.. ఏ ఇంట్లో చూసినా పిల్లలు.. టీవీలు, ఫోన్ లకు అత్తుక్కుపోయి కనిపిస్తున్నారు. నోట్లోకి ముద్ద పోవాలన్నా.. ఈ కాలం పిల్లలకు ఫోన్లు ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత.. స్కూల్స్, కాలేజీలు లేక ఈ ఫోన్ ల వాడకం మరింత ఎక్కువైంది.  చదువులు కూడా ఆన్ లైన్ కావడంతో... తల్లిదండ్రులు కూడా వారికి ఫోన్లు, ట్యాబ్ లు ఇవ్వక తప్పలేదు. అయితే.. ఈ ఫోన్లు ఎక్కువ వాడటం వల్ల పిల్లల్లో మానసిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.

యూట్యూబ్ వీడియోలే కాకుండా.. గేమింగ్ యాప్స్ కూడా పిల్లల మానిసక ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. గతంలో పిల్లలకు హాని కలిగించే చాలా గేమ్స్ ని బ్యాన్ చేశారు..కానీ.. ఇప్పటికీ అలాంటి గేమ్స్ డజన్ల కొద్దీ ఉన్నాయనే చెప్పాలి. అందరి చేతుల్లో ఫోన్, ఇంటర్నెట్ సౌలభ్యం ఉండటంతో... వీటి రీచ్ కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో.. పిల్లలకు ఆ గేమ్స్ కి బానిసలుగా మారుతున్నారు. మరి మీ పిల్లలు కూడా ఫోన్, గేమ్స్ కి బానిసలుగా మారారా..? అది తెలుసుకోవడమోలాగో ఇప్పుడు చూద్దాం..


ఒక పిల్లవాడు ఆటకు బానిస అయ్యాడో లేదో ఎలా తెలుసుకోవాలి?

1. గేమ్ ఆడటానికి , దాని కోసం సిద్ధం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోవడం.. గేమ్ ఆడటం గురించి మరింత ఆలోచించడం
2. మునుపెన్నడూ లేనంతగా గేమ్‌లు ఆడేందుకు ఎక్కువ సమయం వెచ్చించడం
3. ఆటలు ఆడే సమయం తరచుగా నియంత్రణలో ఉండకపోవడం 
4. ఆకస్మికంగా ఆగిపోతే  కోపం, ఆందోళన, నిద్రపట్టక పోవడం.
5.  గేమ్ ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన మీకు ఆసక్తి ఉన్న ఇతర పనులను పక్కన పెట్టేయడం.
ఇలా చేస్తున్నారు అంటే.. వారు గేమ్స్ కి బానిసలుగా మారారు అని అర్థం చేసుకోవాలి.

ఇప్పటికీ ఆటలను కేవలం వినోదంగా మాత్రమే చూస్తుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అది డబ్బు సంపాదించే ఆటగా మారినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. మనం డబ్బు ఖర్చు చేయడమే కాదు, ఇలాంటి ఆటలకు బానిసలైతే వచ్చే శారీరక, మానసిక సమస్యలు విపరీతంగా ఉంటాయి.

వీడియో గేమ్ వ్యసనం లేదా ఆన్‌లైన్ గేమ్ వ్యసనం అనేక రకాల మానసిక ,శారీరక సమస్యలకు దారి తీస్తుంది. డిప్రెషన్, యాంగ్జయిటీ,సోషల్ ఫోబియా వంటి మానసిక సమస్యలు పెద్దలు , పిల్లలలో సాధారణంగా మారిపోతున్నాయి. శారీరక సమస్యలలో దినచర్యలో మార్పులు, నిద్ర రుగ్మతలు, ఊబకాయం ,జీర్ణ సమస్యలు కూడా వస్తుండటం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios