చాలా మందికి ప్రతి విషయంలోనూ గొప్పలు చెప్పుకునే అలవాటు ఉంటుంది. వాళ్లు చేయని దాన్ని కూడా చేశామని.. తెలియనిది కూడా తెలుసు అంటూ.. గొప్పలు చెబుతుంటారు. అయితే.. శృంగారం విషయంలో మాత్రం దాదాపు పురుషులంతా గొప్పలు చెప్పకుంటారని ఓ సర్వేలో తేలింది. ఎక్కువ మందితో శృంగారం చేశాము అనే విషయాన్ని పురుషులు చాలా గొప్పగా భావిస్తారని..దాంట్లో అసలు నిజానికి మించి ఎక్కువగా అతిచేసి చెబుతారట.  యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది.

ఈ సర్వేలో దాదాపు 15మంది స్త్రీ, పురుషులు పాల్గొన్నారు. కాగా.. సగటున ఒక్కో పురుషుడు తమ జీవిత కాలంలో 14 మందితో శృంగారాన్ని ఆస్వాదించామని చెబితే.. ఒక్కో మహిళ ఏడుగురితోనే సెక్స్ అనుభవాన్ని పంచుకున్నట్టు తెలిపారు.  అయితే వీరు చెప్పేదాంట్లో  నిజం లేదనేది నిపుణుల అభిప్రాయం.

ఎలా అంటే... ఈ లోకంలో సగం మంది మగాళ్లు ఉంటే మిగతా సగం ఆడవాళ్లున్నారు. ఆమాటకొస్తే మగాళ్ల సంఖ్యే ఎక్కువ. మగాళ్లు ఎక్కువ మందితో ఎంజాయ్ చేశామని చెప్పి, ఆడవాళ్లు ఆ సంఖ్యను తగ్గించి చెప్పడాన్ని బట్టే విషయం అర్థం అవుతోంది. ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని గ్రహించొచ్చు. తాము ఎవరికన్నా తక్కువ కాదని చెప్పుకోవడానికి మగాళ్లు ఇలా చెబుతారని పరిశోధకులు భావిస్తున్నారు.