మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి... వారితో సెక్స్ చేయడంతోపాటు... బాలిక గర్భవతి కావడంతో ఆమెను బీరువాలో దాచి పెట్టాడు. ఈ దారుణ సంఘటన ఓహియోలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...జువాన్ లియాన్ గోమెజ్ అనే 26 ఏళ్ల యువకుడు.. చాలామంది మైనర్ బాలికలతో శృంగారంలో పాల్గొన్నాడు.  అమాయక బాలికలను ట్రాప్ చేసి.. వారికి మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. అదే ట్రాప్ లో వాళ్లని తన ఇంటికి తీసుకువెళ్లి శృంగారంలో పాల్గొనేవాడు. కాగా... బాధిత బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  పోలీసులు అతనిని కొంత కాలంగా విచారిస్తున్నారు. 

 ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే ఆ అమ్మాయిల్లో ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో గోమెజ్‌ను అనుమానించిన అధికారులు వెంటనే అతని ఇంటిని గాలించారు. ఇంటి లైట్స్ ఆపేసిన గోమెజ్.. ఇంట్లో ఎవరూ లేనట్లు నటించబోయాడు. అయితే అతనితోపాటు ఆ ఇంట్లో ఉండే మరోవ్యక్తి.. పోలీసుల సోదాకు అనుమతినిచ్చాడు. గోమెజ్ గది బీరువాలో బాలిక ఉండటం గమనించిన అధికారులు.. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. బాలికను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆ బాలిక గర్భవతని తేలినట్లు సమాచారం.