Mahashivratri 2023: ఈ ఏడాది ఫిబ్రవరి 18 న మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. ఆ రోజున మహాదేవుడిని ఆరాధిస్తే జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయి. శివుడికి కొన్ని ఇష్టమైన వస్తువులను తెస్తే అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Mahashivratri 2023: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్ధశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు. శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిని ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరుపుకోబోతున్నాం. ఈ రోజున పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు, బాధలు తొలగిపోతాయి. అయితే ఈ రోజున మహాదేవుడికి ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంటికి తీసుకు వస్తే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. అవేంటంటే..
నంది: పురాణాల ప్రకారం.. నంది శివుడి వాహనంగా భావిస్తారు. అందుకే ప్రతి శివాలయంలో వీటిని ప్రతిష్టిస్తారు. అయితే మహాశివరాత్రి నాడు శివుడితో పాటుగా నందిని కూడా పూజిస్తారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మహాశివరాత్రి నాడు వెండి నందిని తయారుచేయించి ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో డబ్బులు ఉన్న ప్లేస్ లో పెట్టండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఏక ముఖి రుద్రాక్ష: ఏక ముఖి రుద్రాక్షణు శివుడి రూపంగా భావిస్తారు. హిందూ మతంలో.. ఏక ముఖి రుద్రాక్షను శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఏక ముఖ రుద్రాక్షణు శివరాత్రి రోజున మీ ఇంటికి తీసుకురండి. శివుడి మంత్రానలు పఠించిన తర్వాత ఏక ముఖి రుద్రాక్షను ధరించండి లేదా ఇంట్లో ప్రతిష్టించండి. ఇది మీ కష్టాలన్నింటినీ పోగొడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీన్ని భద్రంగా ఉంచుకోవడం వల్ల డబ్బు కొరత అసలే ఉండదు.
రత్నాలతో చేసిన శివలింగం: శివలింగానికి నీటితో అభిషేకం చేయకుండా మహాశివరాత్రి పండుగ సంపూర్ణం కాదు. మీరు గ్రహాలతో సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే మహాశివరాత్రిరోజున రత్నాలతో చేసిన శివలింగాన్ని ఇంటికి తీసుకురావాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీన్ని మీ ఇంట్లోని దేవుడి గుడిలో ఉంచి క్రమం తప్పకుండా పూజించండి. గ్రహాలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.
మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడి శివలింగానికి రాగి పాత్రలో నీరు పోసి ప్రసన్నం చేసుకోవచ్చు. ఎప్పుడూ గొడవలు జరిగే ఇండ్లలలో సుఖశాంతుల కోసం రాగి పాత్రలో ఉంచడం ఉత్తమమని చెబుతారు. మహాశివరాత్రి రోజున రాగి పాత్రను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే శుభఫలితాలు తప్పకుండా వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మహామృత్యుంజయ యంత్రం: మహామృత్యుంజయ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఇతర సమస్యలు దరిచేరవని జ్యోతిష్యులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజున మీ ఇంటికి మహామృత్యుంజయ యంత్రాన్ని కూడా తీసుకురావొచ్చు. దీన్ని ప్రతిష్టించిన తర్వాత ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో పూజించడం వల్ల మీ ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి.
