mahashivratri 2023: ఫాల్గుణ మాసం చతుర్ధశి తిథి కృష్ణ పక్షం నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 18న వచ్చింది. ఈ పండుగ సందర్భంగా శివరాత్రినాడు చేయాల్సినవి, చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
mahashivratri 2023: మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున మహాశివుడిని నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ రోజున శివుడి భక్తులంతా ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. ఈ రోజున అర్థరాత్రి శివుడికి పూజలు చేస్తారు. మరి ఈ పండుగ సందర్భంగా శివరాత్రి రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
శివరాత్రి రోజున చేయాల్సినవి
- బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందే లేవాలి.
- ధ్యానం చేయాలి.
- ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. వీలైతే తెల్ల రంగు దుస్తులను ధరించండి.
- వ్రతాన్ని ఆచరించిన వెంటనే బ్రహ్మచర్యం పాటించండి.
- ఉపవాసానికి ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే రెగ్యులర్ డైట్ ప్లాన్ మార్చడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మీ వైద్యుడి సలహా తీసుకునే ఉపవాసం ఉండండి.
- ఓం నమ:శివాయ అని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించండి.
- ఇంట్లో లేదా దేవాలయంలో శివలింగానికి నీరు లేదా పచ్చిపాలతో అభిషేకం చేయండి. నెయ్యి , పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు.
- దతుర పువ్వులు, పండ్లు, బిల్వ పత్రాన్ని సమర్పించండి.
- పసుపునకు బదులుగా శివుడికి చందనాన్ని సమర్పించండి.
- అర్థరాత్రి వేళ పరమేశ్వరుడికి పూజలు చేయండి.
- వ్రత నిర్ధిష్ట పదార్థాలతో పండ్లు, పాలు ఇతర వంటకాలను తీసుకోండి.
మహాశివరాత్రిన చేయకూడనివి
- గోధుమలు, బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఆహారాలకు దూరంగా ఉండండి.
- మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు.
- పొగాకు, మద్యాన్ని సేవించకూడదు.
- శివలింగానికి కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు.
- కేతకి పువ్వులకు దూరంగా ఉండండి.
- పూజ కోసం స్టీల్ కంటైనర్లకు దూరంగా ఉండాలి. బదులుగా ఇత్తడి, రాగి, వెండి పాత్రలను ఉపయోగించండి.
- నలుపు రంగు దుస్తులను దూరంగా ఉండాలి.
- తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు.
