సుఖవ్యాధులు దరిచేరకుండా, అవాంచిత గర్భం రాకుండా, సురక్షిత శృంగారానికి దాదాపు అందరూ కండోమ్ నే ఎంచుకుంటారు. ప్రభుత్వాలు కూడా కండోమ్ ఉపయోగించండి అంటూ ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ఇలా కండోమ్ వాడి అలర్జీల బాధ పడ్డానని, తద్వారా 6నెలలపాటు నరకం అనుభవించానని ఓ వ్యక్తి తన అనుభవాన్ని తెలిపాడు.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. లక్నోకి చెందిన ఓ వ్యక్తి  శృంగారాన్ని బాగా ఆస్వాదించాలనుకున్నాడు. అందుకోసం ఎక్స్‌టెండెడ్ ప్లెజర్ లాటెక్స్ కండోమ్ ని ఉపయోగించాడు. అయితే.. వాటి కారణంగా అతనికి అలర్జీ సమస్య మొదలైంది. పురుషాంగం వాచిపోయి, పుండులా మారిపోవడంతోపాటు నల్లగా కమిలిపోవడంతో ఆ వ్యక్తి హడలిపోయాడు. వెంటనే లక్నోలోకి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేరి చికిత్స పొందాడు. 

డాక్టర్ ఆశిష్ శర్మ నేతృత్వంలోని వైద్యుల బృందం అతడికి చికిత్స చేసింది. లైంగికంగా ఏవైనా ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారించుకోవడం కోసం అతడికి పరీక్షలు నిర్వహించారు. పురుషాంగంపై చర్మాన్ని తినేసి, పుండులా మార్చే అలర్జీ బారిన అతడు పడ్డాడని గుర్తించారు. 

యాంటీ బయోటిక్స్ ఇచ్చి పురుషాంగం వాపు తగ్గించిన డాక్టర్లు.. కుళ్లిపోయిన చర్మాన్ని తొలగించి, స్కిన్ గ్రాఫ్ట్ ద్వారా కొత్త చర్మాన్ని అక్కడ అతికించారు. మూడు వారాలపాటు అతడికి వైద్య చికిత్స అందజేశారు. ఆరు నెలల తర్వాత అతడి పురుషాంగం సాధారణ స్థితికి వచ్చినట్టు గుర్తించారు. సెక్స్‌వల్‌, యూరినరీ ఇన్ఫెక్షన్లేవీ అతడికి లేవని నిర్ధారించారు. 

ఇంతకూ అతడికి ఈ సమస్య ఎలా వచ్చిందో తెలుసా..? శీఘ్ర స్కలనాన్ని అరికట్టడానికి, ఎక్కువ సేపు సెక్స్ చేయడం కోసం.. వాడే ఎక్స్‌టెండెడ్ ప్లేజర్ లాటెక్స్ కండోమ్‌లలో ఉండే బెంజోకైన్ వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుందట. 1996లో తొలిసారిగా ఇలాంటి అలర్జీని గుర్తించారు. ఇలాంటి కేసులు అరుదుగా నమోదు అవుతుంటాయి.