సాధారణంగా చలికాలంలో దోమల బెడద ఎక్కువ. చెప్పాలంటే అవి మేల్కొని మరీ.. మనల్ని నిద్రపోనికుండా చేస్తాయి. కుట్టిన చోట కుట్టుకుండా కుడుతూ మన రక్తాన్ని జ్యూస్ లాగా తాగేస్తుంటాయి. మరి ఈ రాక్షస దోమలను ఏం చేయాలి? ఇంట్లో నుంచి ఎలా తరిమికొట్టాలి?
చలికాలంలో దోమల బెడద కాస్త ఎక్కువే. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ.. ఇంటి నిండా వచ్చి చేరుతాయి. ఇళ్లంతా వాటిదే ఇంకా. నైట్ టైం లోనే కాదు పగలు కూడా కుట్టి కుట్టి రక్తం తాగేస్తుంటాయి ఈ రాక్షస దోమలు. చాలా మంది దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా అవి వస్తూనే ఉంటాయి. మరి ఎలా చేస్తే ఈ దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి? ఆల్రెడీ ఇంట్లో ఉన్న దోమలను ఎలా తరిమి కొట్టాలి? టెన్షన్ పడకండి ఈ ఒక్క చిట్కాతో దోమల సమస్యను దూరం చేయవచ్చు.
నిమ్మకాయతో దోమలకు చెక్
ముందుగా ఒక నిమ్మకాయను తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పైభాగాన్ని పదునైన కత్తితో కత్తిరించాలి. లోపలి గుజ్జును చెంచాతో తీసి గుండ్రంగా కత్తిరించాలి. నిమ్మకాయ పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలో కొద్దిగా ఆవనూనె, లవంగాలు, కర్పూరం వేయాలి. పైన దూది ఉంచి వెలిగించాలి. తర్వాత ఇంటి తలుపులు మూసివేస్తే సరిపోతుంది. క్షణాల్లో దోమలు లేకుండా పోతాయి.
దోమల వల్ల సమస్యలు
దోమల వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతుంటారు. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే.. దోమల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇంట్లోకి దోమలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా దోమలను ఇంట్లోకి రాకుండా నియంత్రించవచ్చు.
దోమలు రాకుండా ఇలా చేయండి
- ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
- బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. దీనివల్ల దోమలు పుట్టవు
- పాత్రల్లో నీరు నిల్వ ఉంచకూడదు
- మురుగు కాల్వలను శుభ్రం చేయించుకోవాలి.
పిల్లల కోసం దోమతెర
పిల్లలు తొందరగా అనారోగ్యం బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని వీలైనంత వరకు దోమల నుంచి కాపాడుకోవాలి. అందుకోసం రాత్రి సమయంలో దోమతెర వేసుకోవడం మంచిది.
