Asianet News TeluguAsianet News Telugu

ముద్దులు..కౌగిలింతలకే ఓటు..

టీనేజ్ లో యువతీ యువకులకు ఆపోజిట్ జెండర్ పట్ల ఆకర్షణ ఉండటం సహజం. అది ప్రేమో, మోజో, వ్యామోహమో.. వాళ్లే ఓ పట్టాన తేల్చుకోలేరు. 

latest survey on romantic thoughts in youngsters
Author
Hyderabad, First Published Jan 3, 2019, 3:37 PM IST


టీనేజ్ లో యువతీ యువకులకు ఆపోజిట్ జెండర్ పట్ల ఆకర్షణ ఉండటం సహజం. అది ప్రేమో, మోజో, వ్యామోహమో.. వాళ్లే ఓ పట్టాన తేల్చుకోలేరు. అలా అని ఇంట్లో పేరెంట్స్ కి చెప్పలేరు. ఇంకొందరైతే.. కనీసం ఫ్రెండ్స్ కి కూడా పంచుకోలేరు.  అలా ప్రేమలో పడి జీవితాలు నాశనం చేసుకున్న యువతీయువకులు చాలా మంది ఉన్నారు.

ఈ విషయం పక్కన పెడితే.. ప్రేమలో ఉన్నప్పుడు..తమ ఆపోజిట్ జెండర్ నుంచి టీనేజర్లు ఎక్కువగా ముద్దులు, కౌగిలింతలు మాత్రమే కోరుకుంటున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడైంది. టీనేజ్ లో ప్రేమ అంటే.. కచ్చితంగా శృంగారంలో పాల్గొంటారనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే.. వారి ఆలోచనలకు ఈ తరం యువత పంటా పంచలు చేస్తోంది.

ప్రేమలో ఉన్నప్పుడు కేవలం ముద్దు, కౌగిలింతలను మాత్రమే ఇష్టపడతామని కొందరు టీనేజీ యువతీయువకులు తెలిపారు. టీనేజీలో ముద్దులు, కౌగిలింతలు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  ఫ్రెండ్ షిప్, లివింగ్ ఇన్ రిలేషన్ షిప్, జోక్స్, సెక్స్, రొమాన్స్ తదితర అంశాల గురించి ఈ  సర్వేలో ఆరా తీశారు.

సెక్స్ సంబంధాలకంటే కూడా ముద్దులు, కౌగిలింతలే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా అబ్బాయిలే.. సెక్స్ పరమైన సంబంధాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios