Asianet News TeluguAsianet News Telugu

వారంలో ఎన్నిసార్లు..?

కొత్త ఉత్సాహంతో.. పెళ్లైన కొత్తలో ఎక్కువ సమయం దీనిపై దృష్టి పెడుతూ ఉంటారు. అయితే.. కొద్ది రోజులకే ఇలా ఎక్కువగా చేయడం వల్ల నీరసపడిపోవడం.. ఇన్ఫెక్షన్స్ రావడం.. ప్రైవేట్ పార్ట్సల్ మంటలు రావడం లాంటివి జరగుతుంటాయి. 

latest survey.. how much of sex is healthy in a week
Author
Hyderabad, First Published Jan 10, 2019, 2:24 PM IST

కొత్తగా పెళ్లైన దంపతులకు శృంగారం విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. వాళ్లకు వచ్చే అనుమానల్లో ఒకటి.. ఎక్కువ సార్లు సెక్స్ లో  ప్రమాదమా కాదా..? అని ఎందుకంటే.. కొత్త ఉత్సాహంతో.. పెళ్లైన కొత్తలో ఎక్కువ సమయం దీనిపై దృష్టి పెడుతూ ఉంటారు. అయితే.. కొద్ది రోజులకే ఇలా ఎక్కువగా చేయడం వల్ల నీరసపడిపోవడం.. ఇన్ఫెక్షన్స్ రావడం.. ప్రైవేట్ పార్ట్సల్ మంటలు రావడం లాంటివి జరగుతుంటాయి. అసలు.. ఇలాంటి సమస్యలు రాకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనాలి అనే విషయంలో..ఓ సంస్థ తాజాగా సర్వే జరిపింది.

వంద మంది కాలేజీ విద్యార్థుల మీద జరిపిన ఓ సర్వేలో.. వారంలో ఒకసారి లేదా అసలు సెక్స్ లో పాల్గొనని వారితో పోలిస్తే.. వారంలో రెండు సార్లు సెక్స్ లో పాల్గొన్న వారిలో ‘ఇమ్యునో గ్లోబ్యులిన్ ఎ’ అనే యాంటీబాడీస్ 30శాతం పెరిగినట్లు గుర్తించారు. రోగనిరోధక శక్తి సామర్థ్యంలో ఇమ్యునోగ్లోబ్యలిన్ ఏ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తేలిక ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యకంగా ఉండాలనుకుంటే.. కనీసం వారానికి రెండు సార్లు సెక్స్ లో పాల్గొనాలి. అంతకన్నా ఒకటి రెండుసార్లు ఎక్కువగా పాల్గొన్నా నష్టం ఏమీ ఉండదు.

దంపతులు ఇద్దరికీ ఆసక్తిగా ఉంటే.. రోజుకి ఒకసారి చేయడం వల్ల కూడా పెద్దగా నష్టమేమీ ఉండదట. అంతకు మించి మితీమీరి చేస్తే మాత్రం.. అనవసర సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు నిపుణులు. 

Follow Us:
Download App:
  • android
  • ios