అక్రమ సంబంధాలు వారే ఎక్కువగా పెట్టుకుంటున్నారట

First Published 24, Jul 2018, 3:03 PM IST
institute for family studies survey over illegal affairs
Highlights

ఇనిస్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ వెల్లడించిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది.55 ఏళ్ల లోపు ఉన్న అమెరికన్ జంటల్లో 14శాతం వివాహేతర సంబంధాలు మాత్రమే ఉండగా.. 55 ఏళ్లు పైబడిన వృద్ధ జంటల్లో 20శాతం మంది వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నారట. 

ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలు తరచూ వింటున్నాం. ఈ అక్రమ సంబంధాలు హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. అయితే.. వీటిపై తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

యువ దంపతులతో పోలిస్తే.. లేటు వయసు దంపతుల్లోనే వివాహేతర సంబంధాలు ఎక్కువని తాజాగా ఓ అధ్యయన సంస్థ వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదంతా అమెరికా సంగతి మాత్రమే. అక్కడి దంపతుల్లో.. యువ జంటల కన్నా వివాహేతర సంబంధాల్లో వృద్ధ జంటలే ముందున్నారు.

ఇనిస్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ వెల్లడించిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది.55 ఏళ్ల లోపు ఉన్న అమెరికన్ జంటల్లో 14శాతం వివాహేతర సంబంధాలు మాత్రమే ఉండగా.. 55 ఏళ్లు పైబడిన వృద్ధ జంటల్లో 20శాతం మంది వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నారట. సుదీర్ఘ కాలం పెళ్లి బంధంలో ఉండటం వల్ల తమ భాగస్వాములను మోసం చేయడం వీరికి సులువుగా మారిందట.

ఓవైపు వృద్ధ జంటల్లో వివాహేతర సంబంధాలు పెరుగుతుంటే.. మరోవైపు యువ జంటల్లో మాత్రం అలాంటి సంబంధాలు గణనీయంగా తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇక బహుభార్యత్వం(పోలియమొరీ), భార్య సమ్మతంతో ఇతరులతో సంబంధం కొనసాగించడం(ఎథికల్ నాన్-మోనోగమి) ఎక్కువగా విస్మరణకు గురవుతున్నాయని తేలింది.

అయితే అమెరికన్ వృద్ధ జంటల్లో మాత్రం పోలియమొరిస్టులు గణనీయంగానే పెరిగినట్లు అధ్యయనం చెబుతోంది. అంతేకాదు, వివాహేతర సంబంధాల పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా 30ఏళ్లుగా తమ జీవిత భాగస్వాములను ఈ విషయంలో మోసం చేస్తున్నవారు దాదాపు 16శాతం వరకు ఉన్నారని పేర్కొనడం గమనార్హం.

loader