insomnia: ప్రతి పది మంది హైదరాబాదీల్లో నలుగురు సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తూ.. అర్థరాత్రి వరకు మెలుకువగానే ఉంటున్నారని పాన్ ఇండియా సర్వేలో వెళ్లడైంది.  దేశం మొత్తం మీద 36 శాతం మంది డిజిటల్ డివైజ్ ల వల్లే నిద్రలేమి సమస్యకు అసలు కారణమని అంటున్నారు.  

insomnia: ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమస్యకు ముఖ్యకారణం.. డిజిటల్ డివైజ్ లు అంటే.. మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్, కంప్యూటర్, టీవీ ల వల్లే చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్టు వెళ్లడైంది. 

పాన్ ఇండియా సర్వే ప్రకారం.. ప్రతి పది మంది హైదరాబాదీల్లో నలుగురు అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తున్నారంట. దీనిమూలంగానే వీరు నిద్రకు దూరమవుతున్నారని తేల్చిచెబుతున్నారు. 2021 లో ఈ సంఖ్య 21 శాతంగా ఉన్నది. 

దేశమంతటా దీనిపై సర్వేచేస్తే.. 36 శాతం మంది నిద్రలేమి సమస్యకు మూల కారణం డిజిటల్ పరికరాలే కారణమని అభిప్రాయపడుతున్నారు. 

గ్రేట్ ఇండియా స్లీప్ స్కోర్ కార్డ్ (జిఐఎస్ఎస్) వివరాలను తెలుసుకోవడానికి పరుపుల తయారీ సంస్థ వేక్ ఫిట్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేకు 2018 నుంచి 2 లక్షలకు పైగా ప్రతిస్పందనలు వచ్చాయి. ఈ ఏడాదిలో 30,000 మంది భాగస్వాములు అయ్యారు. 

ఈ సర్వేలో భాగంగా నిద్రలేమిపై పలు రకాల ప్రశ్నలను అడిగారు. గత ఏడాదితో పోల్చితే హైదరాబాద్ లో నిద్రలేమితో బాదపడుతున్న వారి సంఖ్య 32 శాతం పెరిగిందని సర్వేలో వెళ్లడైంది. 

ఈ సంఖ్యలో 28 శాతం మంది కరోనా మహమ్మారి తర్వాత తమ ఫ్యూచర్ గురించి ఆందోళన చెందుతూ ఇలా అర్థరాత్రి వరకు మెలుకువగానే ఉన్నట్టు చెప్పారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య 2021 లో 20 శాతం గా ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య హైదరాబాద్ లో 49 శాతానికి పెరిగింది. వీరిలో 53 శాతం మంది ఐటీ రంగానికి చెందిన వాళ్లే ఉన్నారు. 

వీటితో పాటుగా నిద్రలేమికి కారణమయ్యే పలు ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ సర్వే వెళ్లడించింది. 87 శాతం మంది పడుకునే ముందు ఫోన్లలో తలదూర్చుతున్నారట. ఈ సంఖ్య గత ఏడాది 94 ఉంటే ..ఈ సంవత్సరం 87 కు తగ్గింది. ఇది శుభసూచికమే అంటున్నారు నిపుణులు. అయితే మొత్తం 67 హైదరాబాదీలు ఉదయం తొందరగా మేల్కొంటున్నారట. 

దేశవ్యాప్తంగా ఎక్కువ మంది నైట్ టైంలో నెగిటీవ్ వార్తలను చూడటానికే సమయం కేటాయిస్తున్నారని సర్వే పేర్కొంటోంది. దేశవ్యాప్తంగా పనిసమయాల్లో నిద్రపోయే వారి సంఖ్య 2020 లో 83 శాతంగా ఉండేది. ఈ సంఖ్య 2022 నాటికి 48 శాతానికి తగ్గిందని సర్వే చెబుతోంది.