Asianet News TeluguAsianet News Telugu

స్వీట్లను తినకుండా ఉండలేకపోతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. మరేం చేయాలంటే .?

ఆరోగ్యంగా బతకాలంలే బలమైన, పోషకాలున్న ఆహారం ఎంతో అవసరం. అందులోనూ నేటి పరిస్థితుల్లో ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తప్పనిసరని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా తీసుకోవడం లేదు. ముఖ్యంగా కొందరైతే స్వీట్లను మోతాదుకు మించి లాగించేస్తూ అనేక అనారోగ్య సమస్యలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు. సో అధికంగా స్వీట్లను తినే అలవాటును కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా మానుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Illnesses caused by eating sweets
Author
Hyderabad, First Published Jan 11, 2022, 9:50 AM IST

Sugar Craving: బతికినంత కాలం ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం కొన్ని రకాల ఆహార నియమాలను తప్పక పాటించాల్సిందే. మనకు తెలుసు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని. అయినా మనం తింటూనే ఉంటాం.. ఈ ఒక్క సారికే.. మళ్లీ ఇంకెప్పుడూ తినను అని ప్రామిస్ లు కూడా ఏసుకుని వాటిని బ్రేక్ చేసిన వాళ్లూ లేకపోలేదు. కానీ ఈ అలవాటు వల్ల శరీరం ప్రమాదంలో పడ్డట్టే సుమీ. జంక్ ఫుడ్, వేయించిన ఆహారం, నూనె అధికంగా ఉండే పదార్థాలు, స్వీట్లను అధికంగా తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా వాటిని పెడచెవిన పెట్టి తినేవారున్నారు.

Illnesses caused by eating sweets

ఇక వీటిలో స్వీట్లను మోతాదుకు మించి తినేవారు లేకపోలేదు. ఎంత తింటున్నామో తెలియకుండా స్వీట్లను లాగించేస్తుంటారు చాలా మంది. కానీ ఈ స్వీట్లను అతిగా తింటే బరువు పెరుగుతారన్న విషయం మీకు తెలుసా..? అలాగే ఇంకా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. వాటిని చూస్తేనే నియంత్రణ కోల్పోయి స్వీట్లను లాగించేస్తుంటారు చాలా మంది. ఇలా అతిగా స్వీట్లను తినడాన్ని షుగర్ క్రవింగ్ అని అంటారు. ముఖ్యంగా స్వీట్లను తినాలనే కోరిక వల్ల సాయంత్రం వేళల్లో శరీరంలో చక్కెర తినాలనే కోరిక విపరీతంగా పెరుగుతుందట. దాంతో మనం సాయంత్రాలు ఎక్కువగా ఫుడ్ తీసుకోవడంతో బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మీరు కూడా స్వీట్లను చూస్తే తినకుండా ఉండలేకపోతున్నారా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Illnesses caused by eating sweets

1.స్వీట్లు తినాలని కోరిక పుట్టినప్పుడల్లా నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలా నీళ్లు తాగుతుంటే కడుపు తొందరగా నిండుతుంది. సో ఆ టైంలో స్వీట్లను తినాలనిపించదు. అందులోనూ.. స్వీట్లను తిన్నా ఎక్కువ తినలేరు. ఇలాగే చేస్తూ ఉంటే స్వీట్లు తినాలన్న కోరికకు క్రమ క్రమంగా దూరమవుతారు. 

2. ఒకవేళ మీరు డైటింగ్ ఉంటే కూడా స్వీట్లను అధికంగా తీసుకునే అవకాశం ఉంది. ఆకలిపై నియంత్రణ లేకపోవడం వల్ల తీపి పదార్థాలను తినాలనిపిస్తుంటుంది. సో డైటింగ్ సమయంలో తృణధాన్యాలు ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడంతో కడుపు నిండుగా ఉంటుంది. అప్పుడు స్వీట్లను తినాలన్న కోరికలు రావని తెలుపుతున్నారు.

3. శరీరానికి కావాల్సిన నిద్ర లేకపోయినా కూడా తీపి తినాలనిపిస్తుంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువగా మెలుకువగా ఉండటంతోనే తీపి పదార్థాలపై మనసు మళ్లుతుందట.  సో రోజుకు సరిపోయే 6 నుంచి 8 గంటల నిద్రను ఖచ్చితంగా పోవాలి. కంటినిండా నిద్రతో ఎన్నో రకాల జబ్బులకు దూరంగా ఉండొచ్చన్న సంగతి మనందరికీ తెలిసిందే.  అందులోనూ సరైన నిద్రపోయే వారి చర్మం నిగనిగా మెరిసిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కంటినిండా నిద్రతో రోజును ఉల్లాసంగా ఉత్సాహంగా పూర్తిచేయవచ్చని తెలుపుతున్నారు.

4. స్వీట్లు తినాలన్న కోరికను బలవంతంగా ఆపినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడం మొదలవుతుందట. దాంతో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు పడుపును నిండుగా ఉండేట్టే చూసుకోవాలి. దీని వల్ల స్వీట్ తినాలనే కోరిక రాదు. కడుపును నిండుగా ఉంచితే కూడా మంచిదే. ఎందుకంటే దీని వల్ల మీ బరువును కోల్పోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios