వారిద్దరూ ట్విన్స్ బ్రదర్స్... ఓ ఫంక్షన్ లో ట్విన్ సిస్టర్స్ పై మనసు పారేసుకున్నారు. అంతే.. ఈ ట్విన్ బ్రదర్స్..  ట్విన్ సిస్టర్స్ ని పెళ్లాడారు. ఇప్పుడు వారిలో ఓ దంపతులకు మొదటి సంతానం కలిగింది. దీంతో.. వారు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇంతకీ ఈ ట్విన్ స్టోరీ ఏంటో ఓసారి చూస్తే..

కవలలు అంటే.. ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది. ఎంత కవలలైనా ఏదో ఒక తేడా ఉంటుంది. అయితే..  అమెరికాకు చెందిన ఈ ట్విన్ బ్రదర్స్ మాత్రం అచ్చం ఒకేలా ఉంటారు. ఓ ఫంక్షన్ కి వెళ్లి.. అక్కడ ఓ ట్విన్ సిస్టర్స్ పై మనసుపారేసుకున్నారు. వారిద్దరూ కూడా అచ్చం ఒకేలా ఉన్నారు. ఎవరు ఎవరో కూడా గుర్తించడం కష్టమనేలా ఉన్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 

ఈ పెళ్లితో వీరు బాగా ఫేమస్ అయ్యారు. 35 ఏళ్ల జోష్, జెర్మీ సాల్యేర్ అనే కవల సోదరులు.. మూడేళ్ల క్రితం 33 ఏళ్ల బ్రిటానీ, బ్రియాని  అనే కవల సోదరీమణులను పెళ్లి చేసుకున్నారు. 

అంతేకాకుండా ఇరు జంటలు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామని గతేడాది ఒకేసారి ప్రకటించారు. తాజాగా వీరిలో బ్రిటాని- జోష్ జంట ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు జోష్. "బ్రిటానికి బాబు పుట్టినందుకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. పరిపూర్ణ ఆరోగ్య వంతుడిగా జన్మించాడు. ప్రతి ఒక్కరు జెట్ స్లాయేర్ ను కలవండి. జెట్ కు తండ్రి అయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది" అని జోష్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.


అయితే.. వారిద్దరూ ఒకేసారి గర్భం దాల్చడం విశేషం. అయితే.. వారు కూడా కవలలకు జన్మనిస్తే బాగుండని కోరుకున్నారు కానీ అది జరగలేదు. కనీసం ఒకేసారి జన్మనివ్వాలని ఆశపడ్డారు. కానీ అది కూడా జరగలేదు. ఇద్దరిలో ఒక్కరి మగ బిడ్డ జన్మనివ్వగా.. మరొకరికి తర్వలో డెలివరీ కానుంది. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ వార్త వైరల్ గా మారింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని వారు చెప్పారు.