Asianet News TeluguAsianet News Telugu

100 కాదు 180 ఏండ్లు.. మనిషి జీవిత కాలం పెరగబోతోందట.. ఎలానో తెలుసా..?


ఎంత బలమైన ఫుడ్ తీసుకున్నా.. ఎంత శారీరక శ్రమ చేసినా.. 50 ఏండ్లు బతకడమే మహా ఎక్కువ అని అనుకోని వారుండరు. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో 60 ఏండ్లకు మించి బతకడమంటే మాటలు కావు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, పోషకలేమి ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు మనిషి ఆయుష్షును అమాంతం తగ్గించేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రానున్న కాలంలో మనిషి ఏకంగా 150 ఏండ్లకు పైగానే జీవిస్తాడట.  

Humans life time is going to increase.
Author
Hyderabad, First Published Jan 11, 2022, 12:12 PM IST

ఈ భూమ్మీదున్న ఏ జీవి ప్రాణానికి కూడా గ్యారంటీ లేదు. ఈ నిమిషం మనకళ్లముందే ఉన్నా.. మరునిమిషంలో అతను బతికే ఉంటాడు అన్న నమ్మకం ఎవ్వరూ ఇవ్వలేనిది. అది ఎలాగైనా కానీయండి. కానీ మన ఆరోగ్యం తోనే మన ఆయుష్షు (life time) ముడిపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకవిలువలున్న ఫుడ్ ను తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకుని ఎక్కువ కాలం జీవించొచ్చు అనేది వాళ్లు నమ్మిన సూత్రం. కానీ నేడు చాలా మంది ఫుడ్ పై కేరింగ్ ను గాలికి వదిలేసారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గజిబిజీ లైఫ్ లో కడుపు నిండిందా లేదా అనేదే చూస్తున్నారు కానీ.. దీన్ని తినడం వల్ల నాకు ఇంతైనా శక్తి వస్తుందా అనేది ఎవరూ చూడటం లేదు. అందుకే మన తాతల కాలంలో 100 ఏండ్లు బతికితే మనం 50 లేదా 60 ఏండ్లకే ఈ జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నాం. ఊరికే ప్రాణాలు పోతున్నాయా అంటే అదీ లేదు. 

మంచాన పడి లేవలేకుండా అయ్యి అనేక రోగాలతో శరీరం చచ్చుబడి ప్రాణాలు విడుస్తున్నాం. ఇక ఈసంగతి పక్కన పెడితే.. ప్రాణం మీద తీపి ఉన్న వాళ్లకు మంచి శుభవార్త చెప్పారు ఓ శాస్త్రవేత్త. రాను రాను మనిషి ఆయుష్షు తగ్గుతుందని అందరూ భావిస్తున్న కాలంలో.. రానున్న కాలంలో మన లైఫ్ టైం (life time) పెరగనుందని చెబుతున్నారు. ఏంటి ఇది నిజమా.. నమ్మొచ్చా అంటే బేషుగ్గా నమొచ్చండి. యెనకట్లో మన తాతలు సుమారుగా 100 ఏండ్లకు పైగానే జీవించారు. మనం ఇప్పుడు 60 నుంచి 50 ఏండ్లు బతుకుతున్నాం. కానీ వచ్చే శతాబ్దం(2100 సంవత్సరం) నుంచి మనుషులు 180 ఏండ్లు బేషుగ్గా జీవిస్తారన్న విషయాన్ని శాస్త్రవేత్త వెళ్లడించారు. అలాగే ఈ శతాబ్దం చివరి వరనున్న వాళ్లు ఏకంగా 130 ఏండ్లు జీవిస్తారని వారు భావిస్తున్నారు. 

2100 సంవత్సరానికి మనుషులు 180 ఏండ్లు జీవిస్తారన్న విషయాన్ని కెనడాలోని హెచ్ఈసీ మాంట్రియల్ కు లియో బెల్జిల్ అనే ప్రొఫెసర్ వెళ్లడించారు. ఎక్కువ కాలం జీవించిన మనుషుల్లో జీన్ కాల్మెంట్ అనే ఫ్రెంచ్ మహిళ ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసింది. ఈమె 122 ఏండ్ల వయస్సులో ప్రాణాలు విడిచింది. కాగా 60 ఏండ్లే బతకడం కష్టమనుకున్న ఈ కాలంలో 180 ఏండ్లు ప్రాణాలతో ఉండటం అంటే మాటలు కావు. అయితే మనుషుల లైఫ్ టైం (life time) ఇంత.. అంటూ పరిమితులేమీ లేవని లియో బెల్జిల్ పేర్కొంటున్నారు. కానీ ఆయుష్షు ఎంత పెరిగితే వైద్య సేవలు అంతకంటే మరింత అవసరమని ఆయన భావిస్తున్నారు. 

వయస్సు మీద పడుతున్న కొద్దీ అనేక రోగాల భారిన పడే అవకాశాలున్నాయి. అందులోనూ ఓ సర్వే ప్రకారం.. ఒక మనిషి ఎక్కువ కాలం జీవిస్తున్న (life time)  కొద్ది తన శరీరంలో ఉన్న ఒక్కో భాగం పనిచేయడం మానేస్తాయట. అందులోనూ గుండె కవాటాలు, కార్నియా, మోకాల్లు అనారోగ్యానికి గురైతే మాత్రం వాటిని మార్చాల్సి ఉంటుందని సర్వే వెళ్లడిస్తోంది. ఏ పనిచేయలేని స్థితిలో ఉన్న వాళ్లు డాక్టర్లు చూపించుకోవడం పక్కన పెడితే మెడికల్ బిల్లును ఎలా కడతారనేదే ప్రశ్న. ఏదేమైనా మనుషులు తమ కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి మరికొంత సమయం వచ్చిందనే చెప్పాలి.   

Follow Us:
Download App:
  • android
  • ios