స్త్రీలతో పోలిస్తే.. పురుషులకు లైంగికాసక్తి ఎక్కువగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. పెళ్లైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరికీ  శృంగారం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ... సంవత్సరాల గడుస్తున్న కొద్ది స్త్రీలలో ఆ ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇంటి పనులనీ.. పిల్లల గురించి ఇలా రకరకాల గురించి ఆలోచిస్తూ.. భర్తను కాస్త దూరం పెట్టేస్తుంటారు. కానీ.. పురుషులకు మాత్రం ఆసక్తి తగ్గకపోగా.. భార్య అలా దూరం పెట్టడాన్ని భరించలేరు. ఇలాంటి సమయంలోనే చాలా మంది ఇతర స్త్రీలకు కనెక్ట్ అవుతుంటారు.

వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల జీవితాలు నాశనమైపోతాయి కాబట్టి.. మీ భార్యకే శృంగారం పట్ల ఆసక్తి పెంచితే సరిపోతుందంటున్నారు నిపుణులు. అదెలానో ఇప్పుడు చూద్దాం...

మీ పట్ల మీ భార్యకు ఇష్టం, ఆసక్తి పెరిగేలా ప్రవర్తించండి. మరీ ముఖ్యంగా మీ మీద లైంగికార్షణ పెరిగేలా సరదాగా జోకులు వేస్తూ, వీలున్నప్పుడల్లా చొరవ తీసుకుని ముద్దులతో, కౌగిలింతలతో మురిపిస్తూ ఉండాలి.

లైంగిక జీవితం మీద అనాసక్తత ఏర్పడడానికి కారణాన్ని మీ భార్యను  అడిగి తెలుసుకోండి. ఆ కారణం పరిష్కరించగలిగేదైతే తప్పక పరిష్కరిస్తానని హామీ ఇవ్వండి. అప్పుడామె నోరు విప్పి చెబుతుంది. ఆమె ఏం చెప్పినా... ‘ఇలాంటివి ఇంతకుముందు విని ఉన్నాను. ‘ఇది నువ్వనుకునేంత పెద్ద సమస్య కాదు అనో, మనసుకు ఎక్కించుకోకు’ అనో అనునయించండి.

మీకంటూ ప్రత్యేకంగా సమయం కుదుర్చుకోండి. భార్యతో ఏకాంతంగా గడపండి. ఇలా చేస్తే.. కచ్చితంగా మీ భార్యలో మళ్లీ ఆసక్తి మొదలౌతుంది.