వానాకాలంలో దుస్తులు తొందరగా ఆరాలంటే ఏం చేయాలి?
వర్షాకాలంలో బట్టలు ఆరడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సీజన్ లో ఎండ రాదు. ఆకాశం మొత్తం మబ్బులు పట్టి ఉంటుంది. అలాగే వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. దీనివల్ల ఉతికిన బట్టలు ఆరక, వాటి నుంచి వాసన వస్తుంటుంది. కానీ మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయ్యారంటే ఈ సీజన్ లో కూడా బట్టలు తొందరగా ఆరిపోతాయి. అదెలాగంటే..
వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. ఇంకేముందు ఇకనుంచి ప్రతిరోజూ వాన పడుతూనే ఉంటుంది. వాన పడకున్నా వాతావరణం మాత్రం చల్లగానే ఉంటుంది. కానీ వర్షాకాలంలో జనాలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. వానల వల్ల సీజన్ వ్యాధులు బాగా వస్తాయి. అలాగే రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవడం, ఎక్కడికక్కడ బురద, బట్టలు ఆరబెట్టకపోవడం, రోడ్లపై ఎక్కువ సేపు ట్రాఫిక్ ఉండటం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఆడవాళ్లకు బట్టలను ఆరబెట్టడం పెద్ద టాస్క్ లాగే ఉంటుంది. వానాకాలం వాతావరణం వల్ల దుస్తులు అంత తొందరగా ఆరవు. దీనివల్ల దుస్తుల నుంచి ఒక వింత వాసన వస్తుంది. మరి ఈ సీజన్ లో దుస్తులు తొందరగా ఆరడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తడి దుస్తులు తొందరగా ఆరాలంటే ఏం చేయాలి?
బట్టలను ఉతికిన తర్వాత వాటిని ప్రెస్ చేయకుండా ఒక స్టాండ్ పై వేలాడదీయండి. వీటన్నింటినీ ఒక గంట పాటు అలాగే ఉంచండి. దీంతో దుస్తులకున్న నీరంతా కారిపోతుంది. ఆ తర్వాత చేతులతో దుస్తులను మళ్లీ పిండండి. దీంతో దుస్తులకు ఉన్న మిగిలిన నీరు కూడా పోతుంది. ఇప్పుడు దుస్తులను మూడు నాలుగు సార్లు బాగా దులపండి. దీంతో నీటి తుంపర్లు దుస్తుల నుంచి తొలగిపోతాయి.
మీ దగ్గర వాషింగ్ మిషిన్ లేకుంటే వాటిని బయట ఆరబెట్టండి. మీ చేతులతో బట్టలను నొక్కిన తర్వాత ఇంటి హాటెస్ట్ రూమ్ లో ఆరేయండి. లేదా మీరు ఒక గదిలో తాడును కట్టి దానిపై ఆరేయండి. ఒకవేళ మీకు ఒకేగది ఉంటే రాత్రిపూట బట్టలను ఆరబెట్టండి. ఇబ్బంది ఉండదు. రాత్రంతా గదిలో ఫ్యాన్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి తొందరగా దుస్తులు ఆరిపోతాయి.
వర్షాకాలంలో దుస్తులను ఆరబెట్టడానికి సులువైన మార్గం..
వంటగదిలో తడి దుస్తులు చాలా తొందరగా ఆరిపోతాయి. అయితే ఇందుకోసం మీరు రాత్రిపూటే దుస్తులను ఆరేయాలి. వంటింట్లో చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి మీరు వంటింటి పని అంతా అయిపోయిన తర్వాత ఒక తాడు కట్టి బట్టలను ఆరేయండి. అయితే గ్యాస్ ఆఫ్ చేసి, వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే దుస్తులను ఆరేయాలి. కేవలం ఒక గది, ఒక వంటగది ఉన్నవారికి ఈ చిట్కాలు పనిచేస్తాయి.
వర్షాకాలం మీ కోసం పనిచేస్తుంది.
వీటితో తడి బట్టలు ఆరబెట్టండి
మీరు దుస్తులను హెయిర్ డ్రయ్యర్, ప్రెస్, హీటర్ లతో కూడా ఆరబెట్టుకోవచ్చు. దుస్తులు ఆరిపోయే వరకు మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. రాత్రిపూట దుస్తులపై లైట్ డ్రయ్యర్ కొట్టి, ఫ్యాన్ ఉన్న రూమ్ లో ఆరేయండి. ఇలా చేయడం వల్ల ఉదయానికల్లా బట్టలు ఆరిపోతాయి. ఇక హీటర్ తో దుస్తులను ఆరబెట్టాలంటే హీటర్ ను 1 నుంచి 2 గంటలు ఉపయోగించండి. ఆ తర్వాత ఫ్యాన్ తిరిగే గదిలో ఆరేస్తే సరి.