Asianet News TeluguAsianet News Telugu

బ్రష్ వాడకుండా షర్ట్ కాలర్ ను ఈజీగా ఎలా శుభ్రం చేయొచ్చో తెలుసా?


షర్ట్ మొత్తం తెల్లగా, ఎలాంటి మరకలు లేకున్నా.. కాలర్ మాత్రం నల్లగా అవుతుంటాయి. కానీ ఈ కాలర్ లను క్లీన్ చేయడం అంత ఈజీ కాదు. వీటిని అర్థగంటపాటు సర్ఫు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత సబ్బు పెట్టి బ్రష్ తో రుద్ది శుభ్రం చేస్తుంటారు. కానీ ఇలా చేయకున్నా టూత్ పేస్ట్ తో చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. అదెలాగంటే? 

How to clean shirt collar quickly rsl
Author
First Published Jul 3, 2024, 9:44 AM IST


ఆఫీలకు వెళ్లేవారే కాదు, పార్టీకి వెళ్లేవారు, రాజకీయాల్లో తిరిగేవారు రెగ్యులర్ గా వైట్ దుస్తులనే వేసుకుంటారు. ఇక ఆఫీసుల్లో ఫార్మల్ దుస్తుల్లో వైట్ షర్ట్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలుపు రంగు ప్రతి ఒక్కరికీ నప్పుతుంది. అందుకే చాలా మంది వైట్ కలర్ షర్ట్ లను వేసుకోవడానికే ఇంట్రస్ట్ చూపుతారు. కానీ వీటిని శుభ్రం చేయడం పెద్ద సమస్యే. 

వైట్ షర్ట్ చాలా తొందరగా నల్లగా అవుతాయి. ఏ చిన్న మరక పడ్డా పెద్దగా కనిపిస్తుంది. అందులోనూ వైట్ షటర్ట్ లపై పడిన మరకలు అంత ఈజీగా పోవు. అందులోనూ ఈ చొక్కాల కాలర్లకు మురికి బాగా పడుతుంది. పొద్దున్న వేసుకున్నా సాయంత్రానికల్లా షర్ట్ కాలర్ నల్లగా మారుతుంది. వీటిని క్లీన్ చేయడానికి ఆడవాళ్లు చాలా కష్టపడతారు. సర్ఫులో నానబెట్టడం, సబ్బును మళ్లీ మళ్లీ రుద్ది బ్రష్ తో క్లీన్ చేస్తుంటారు. వీటిని క్లీన్ చేసి చేసి చేతులు నొప్పి పుట్టడమే కానీ ఇవి మాత్రం క్లీన్ కావు. కానీ మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం వైట్ షర్ట్ కాలర్ లను బ్రష్ లేకుండా రెండు నిమిషాల్లో క్లీన్ చేయొచ్చు. దీనికోసం మీరు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

టూత్ పేస్ట్ తో వైట్ షర్ట్ కాలర్ ను ఎలా శుభ్రం చేయాలి?

టూత్ పేస్ట్ ను పళ్లు తోముకోవడానికే కాదు.. మీరు క్లీనింగ్ కోసం కూడా ఉపయోగించొచ్చు. అవును టూత్ పేస్ట్ తో మీరు వైట్ షర్ట్ కాలర్ ను చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా చొక్కాను అరగంట పాటు నీళ్లలో నానబెట్టండి. ఆ తర్వాత కాలర్ కు టూత్ పేస్ట్ ను అప్లై చేసి దానిపై 1 టీస్పూన్ ఉప్పును చల్లండి. ఇప్పుడు కాలర్ ను చేతులతో రుద్దండి. తర్వాత నీళ్లలో కడిగి ఆరేయండి. అంతే ఇలా చేయడం వల్ల కాలర్ కు పట్టిన మురికి మొత్తం పోతుంది. 

నిమ్మకాయ, ఉప్పుతో షర్ట్ కాలర్ ను ఎలా శుభ్రం చేయాలి? 

నల్లగా మారిన వైట్ షర్ట్ కాలర్ ను మీరు నిమ్మకాయ, ఉప్పుతో కూడా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం షర్ట్ ను అర్థగంటపాటు నానబెట్టిన తర్వాత నిమ్మరంస,  ఉప్పు వేయండి. ఆ తర్వాత దానిపై ఏదైనా డిటర్జెంట్ పౌడర్ ద్రావణాన్ని  కూడా వేయొచ్చు. ఇలా క్లీన్ చేసినా కూడా కాలర్ తెల్లగా మెరిసిపోతుంది. కాలర్ ను క్లీన్ చేసిన తర్వాత మీరు ఈ పద్దతిని ఫాలో కావాలి. 


చొక్కా కాలర్ పై మరకలు ఎంతకీ పోయే సరికి అయ్యో ఇక షర్ట్ ను వేసుకోకూడదని అనుకుంటుంటారు. కానీ మీరు షర్ట్ కాలర్ మొండి మరకలను టూత్ పేస్ట్ తో చాలా ఈజీగా, ఫాస్ట్ గా పోగొట్టొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా షర్ట్ ను ముందు నీళ్లలో నానబెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టీస్పూన్ టూత్ పేస్ట్ వేసి దానిలో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి కలపండి. దీన్ని స్పూన్ తో తీసుకుని చొక్కా కాలర్ పై అప్లై చేసి నిమ్మ తొక్కతో రుద్దండి.  దీనివల్ల కాలర్ తెల్లగా తలతల మెరుస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios