దీన్ని ఫాలో అయితే.. మీ జుట్టు రాలే సమస్యే ఉండదు..
చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ఆహారం ఒకటి. సరైన పోషకాలు అందకపోవడం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలుతుందని నిపుణులు అంటున్నారు.
జుట్టు రాలే సమస్య ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఉంది. ఒకప్పుడు పెద్దవయసు వారికి మాత్రమే వెంట్రుకలు బాగా ఊడిపోయేవి. కానీ ఇప్పుడు పెద్దవయసు వారికే కాకుండా చిన్ని పిల్లలకు కూడా వెంట్రుకలు విపరీతంగా రాలుతున్నాయి. జుట్టు పెరిగేందుకు ఎన్నో చికిత్సలు ఉన్నాయి. అయినప్పటికీ మన లైఫ్ స్టైల్ బాగుంటేనే మన జుట్టు ఆరోగ్యంగా, రాలకుండా ఉంటుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.అసలు జుట్టు రాలకుండా ఉండటానికి మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
స్కాల్ప్ మసాజ్
జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో దుమ్ము కూడా ఉంది. ఎక్కడికి వెళ్లినా.. కాలుష్యం, దుమ్ము ఖచ్చితంగా ఉంటాయి. ఈ దుమ్ము మన జుట్టులో పేరుకుపోవడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. ఈ చుండ్రు మన జుట్టు రాలాడానికి దారితీస్తుంది. ఇలాంటి సమస్య మీకు రావొద్దంటే వారానికి ఒకసారైనా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మీ నెత్తికి మసాజ్ చేయండి. హెయిర్ రూట్ వరకు మసాజ్ చేయగలిగితే మీ జుట్టు బలంగా ఉంటుంది.
ఆహారం
జుట్టు రాలడానికి మనం తినే ఆహారం కూడా ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు పౌష్టికాహారం తినండి. దీనిలో కూరగాయలను, పండ్లను, పప్పుదినుసులను చేర్చుకోవాలి. ముఖ్యంగా మీరు ఏ ఆహారం వండినా జుట్టు పెరుగుదలకు తోడ్పడే కరివేపాకు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి.
జడ అల్లడం
స్కూలుకు వెళ్లేటప్పుడు జుట్టు చెక్కు చెదరకుండా ఉండటానికి గట్టిగా దువ్వి జడను అల్లుతుంటారు తల్లులు. కానీ ఈ అలవాటు లైఫ్ లాంగ్ ఉంటుంది.కానీ ఇలా ఎప్పుడూ అల్లుకోవడం వల్ల జుట్టు విపరీతంగా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలకూడదంటే జుట్టును మరీ టైట్ గా అల్లకూడదు.
హైడ్రేటెడ్ గా ఉండటం
ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటుగా మీరు హైడ్రేట్ గా కూడా ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా మీ జుట్టుకూడా పొడుగ్గా పెరుగుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. సరిగ్గా నిద్రపోకపోయినా కూడా జుట్టు రాలిపోతుంది. అందుకే మీరు8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి.