Asianet News TeluguAsianet News Telugu

బ్లూ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? దీనిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో తెలుసా?

బ్లూ టీ గురించి తెలిసిన వారు చాలా  మందే ఉన్నారు. దీన్ని తాగే వారు ఇంకా తక్కువనే చెప్పాలి. కానీ దీనిని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి తెలుసా? 
 

Health benefits of blue tea
Author
First Published Feb 9, 2023, 12:43 PM IST

బ్లూ టీని శంఖు పువ్వుతో తయారుచేస్తారు. దీనిలో కెఫిన్ కంటెంట్ మొత్తమే ఉండదు. ఇది క్లిటోరియా టెర్నేటా మొక్క పూ రేకుల కషాయం నుంచి తయారైన పానీయం. ఈ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఫుడ్ & న్యూట్రిషన్ రీసెర్చ్ జర్నల్ ప్రకారం.. దీనిలో ఆంథోసైనిన్లు యాంటీఆక్సిడెంట్లు, సహజ వర్ణద్రవ్యాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని మొక్కలకు నీలం, ఊదా, ఎరుపు రంగును ఇస్తాయి. ఇవి శంఖు పువ్వులో సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఉండే ఆంథోనిసైనిన్లు రంగును మార్చుతాయి. అసలు ఈ బ్లూ టీ మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బరువు తగ్గుతారు

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఊబకాయం . కానీ ఈ ఊబకాయం ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. దీనివల్ల రోజు వారి పనులను కూడా సరిగ్గా చేసుకోలేరు. అందుకే ఈ సమస్య నుంచి బయటపడటానికి వ్యాయామం చేస్తుంటారు. కొన్నిఆహారాలకు దూరంగా ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు తీపి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. బరువు తగ్గాలంటే టీని కూడా మానేయాల్సి ఉంటుంది. కానీ సడెన్ గా టీని మానేయడం చాలా కష్టం. నిజానికి బరువు తగ్గాలంటే టీని మానేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు రోజు తాగే టీని కాకుండా మూలికా టీని తాగాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి గ్రీన్ టీతో పాటుగా బ్లూ టీ కూడా ఎంతగానో సహాయపడుతుంది. 

చర్మం, జుట్టుకు మంచిది

ఈ బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ టీ యాంటీ ఏజింగ్ ప్రయోజనాలకు ప్రసిద్ది చెందింది. దీన్ని తాగడం వల్ల మీ చర్మం లోపలి నుంచి యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. చర్మ వృద్ధాప్యంతో బాధపడేవారు ఈ బ్లూ టీని ఖచ్చితంగా తాగాలంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే యాంటీ గ్లైకేషన్ ప్రభావాలు చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి. బ్లూ టీలో ఉండే ఫ్లేవనాయిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. శంఖు పువ్వు జుట్టుకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఆంథోసైనిన్ ఉంటుంది. ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. 

ఒత్తిడిని తగ్గిస్తుంది

బ్లూ టీ ఒత్తిడిని తగ్గించడానికి కూడా గొప్పగా సహాయపడుతుంది. బ్లూ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి.  ఈ టీ మన మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుతుంది. అంతేకాదు మనస్సును ప్రశాంతంగా కూడా ఉంచుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు బ్లూ టీ తాగడం వల్ల పని ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపోతారు. 

పారాసిటమాల్ గా పనిచేస్తుంది

ఈ బ్లూ టీ పారాసిటమాల్ మాదిరిగానే పనిచేస్తుంది. ఎలా అంటే ఇది ఒంటి నొప్పులను, జ్వరాన్ని తగ్గిస్తుంది. బ్లూ టీ శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గును తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

జీర్ణక్రియను సులభతరం చేస్తుంది

బ్లూ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.మీ డిటాక్స్ డైట్ లో చేర్చడానికి ఇదొక్క గొప్ప పానీయం. ముఖ్యంగా వేసవిలో. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీస్తాయి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఖాళీ కడుపుతో ఒక కప్పు బ్లూ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన ఫ్రీటాక్సిన్స్ బయటకు వెళ్లి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios