రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు తీసి బయటకు పెట్టలేని పరిస్థితి. ఈ ఎండ వేడి నుంచి బయటపడాలంటే... ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి అందరూ కూల్ డ్రింక్స్ ని ఎంచుకుంటారు. చల్లగా కడుపులోకి కూల్ డ్రింక్ పడితే... కాసేపటి వరకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది.

అయితే.. ఆ క్షణాన కూల్ డ్రింక్ హాయిగా అనిపించినా... ఆరోగ్యానికి మాత్రం చాలా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కూల్ డ్రింక్స్ అతిగా తాగడం వల్ల బరువు అమాంతం పెరిగిపోతారు. అంతేకాదు.. కూల్ డ్రింక్స్ లో చెక్కర, కెలరీల శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో... షుగర్, ఉబకాయ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బరువు తగ్గాలనుకునేవారు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండడం చాలా మంచిది. కూల్‌డ్రింక్స్‌లో సోడా శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై మళ్లీ మళ్లీ తింటాం. దాంతో.. బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు... వాటిల్లో ఉపయోగించే కెమికల్స్ కూడా ప్రాణానికి అంత ఉపయోగమేమీ కాదు. కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.