Asianet News TeluguAsianet News Telugu

కండోమ్.. భావప్రాప్తికి అడ్డుగా మారిందా?


కండోమ్ వద్దే వద్దు అంటున్న యువత

Government Condoms have less takers now, users look for other options
Author
Hyderabad, First Published Jul 3, 2018, 11:31 AM IST

హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖవ్యాధులు, అవాంచిత గర్భం.. వీటన్నింటి నుంచి దూరంగా ఉండటానికి చక్కటి పరిష్కారం కండోమ్. ఈ కండోమ్స్ మార్కెట్ లోకి వచ్చిన నాటి నుంచి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగానే కృషి చేశాయి. జనాభాను కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా వీటిని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉచితంగా పంపిణీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఈ కండోమ్స్ ని వినియోగించడానికి ఆసక్తి చూపించడం లేదట..

నమ్మసక్యంగా లేకపోయిన ఇది ముమ్మాటికీ నిజం. కండోమ్ కి బదులుగా ఇతర ప్రత్యామ్నాయల కోసం వెదుకుతున్నారట. ఇది మేము చెబుతున్న మాట కాదు. ఓ సర్వేలో వెల్లడైన నిజం. శృంగార సమయంలో సంతృప్తి, భావప్రాప్తికి కండోమ్‌ను అడ్డు భావిస్తున్నారు! గర్భం రాకుండా ఉండేందుకు పిల్స్‌, కాపర్‌ టీ ఇంజెక్షన్లు, ట్యుబెక్టమీ, వెసక్టమీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు తప్ప భావప్రాప్తి విషయంలో రాజీపడట్లేదు. 

ఫలితంగా ఈ ఆరేళ్ల కాలంలో కండోమ్‌ల వినియోగం భారీగా తగ్గిపోయింది. ఆస్పత్రులు, ఆశా కార్యకర్తల ద్వారా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే కండోమ్‌ల వినియోగం దేశంలోని 19 రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయాన్ని తెలిపింది. 2011-12లో ప్రభుత్వం ఉచితంగా 59,61,251 కండోమ్‌లు సరఫరా చేయగా.. 2016-17లో వాటి సంఖ్య 45,76,642కు తగ్గిపోయింది.

అత్యధికంగా రాజస్థాన్‌లో 2011-12లో 10,84,700 కండోమ్‌లను వినియోగించగా.. 2016-17లో ఆ సంఖ్య 6,50,542కు తగ్గింది. కాగా.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం కండోమ్‌ల వినియోగం పెరగడం విశేషం. దాద్రా నగర్‌ హవేలీలో 2011-12లో 1,116 కండోమ్‌లు వినియోగించగా.. 2016-17లో ఆ సంఖ్య 2,680కి పెరిగింది. అయితే.. కండోమ్‌ల వినియోగం తగ్గిందనడం వాస్తవం కాదని బెంగళూరుకు చెందిన ఓ హోటల్‌ మేనేజర్‌ సురేశ్‌ ఘోష్‌ అన్నారు. ‘ ఈ రోజుల్లో ప్రభుత్వం పంపిణీ చేసే కండోమ్‌లు ఎంతమంది వాడుతున్నారు? ఫార్మసీ వరకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సులువుగా దొరికేస్తున్నాయి. కాబట్టి వాటి రిపోర్టులను కూడా పరిశీలించాలి. అప్పుడే వాస్తవం తెలుస్తుంది.’ అని అభిప్రాయపడ్డారు. 

కాగా.. కండోమ్‌ల వినియోగం తగ్గడంతో ఎయిడ్స్‌, ఇతర సుఖవ్యాధులు విజృంభించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. పిల్స్‌, కాపర్‌ టి వంటి ప్రత్యామ్నాయాలు గర్భం రాకుండా అడ్డుకుంటుంది కానీ సుఖవ్యాధులను నియంత్రించలేదు కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios