శృంగారంలో పాల్గొంటూ.. ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో సెక్స్ చేస్తూనే ప్రాణాలు వదిలాడు. అయితే... అతను ఆఫీసు పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి.. అక్కడ స్త్రీతో సెక్స్ లో పాల్గొని ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. దీనికి సంబంధించిన కేసు ఇటీవల కోర్టుకు ముందుకు రాగా.. దీనిపై న్యాయస్థానం స్పందిచింది. స్నానం చేయడం, భోజనం చేయడం లాంటిదే శృంగారంలో పాల్గొనడం కూడా అని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ సంఘటన పారిస్ లో చోటుచేసుకోగా... దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

2013లో టీఎస్ వో  అనే రైల్వే నిర్మాణ సంస్థ కు చెందిన ఓ ఉద్యోగి జేవియర్ ని కంపెనీ ఆఫీసు పని నిమిత్తం లాయిరెట్ అనే ప్రాంతానికి పంపించింది. కాగా.. అతను అక్కడ వేరే స్త్రీతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో గుండె నొప్పి రావడంతో అతను కన్నుమూశాడు. అయితే.. ఆఫీసు పనిమీద వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి... పరిహారం ఇవ్వాలని అతని కుటుంబసభ్యులు కోరారు. దానికి కంపెనీ నిరాకరించింది. సదరు వ్యక్తి తన వ్యక్తిగత అవసరం కోసం శృంగారంలో పాల్గొన్నాడని.. దాని వల్ల పర్యటన ఉద్దేశంపైనా ప్రభావం చూపించిందని కంపెనీ వాదించింది.

దీంతో చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది.  శృంగారంలో పాల్గొనడం అనేది.. స్నానం చేయడం, భోజనం చేయడం వంటి రోజువారీ పనిలాంటిదనేని చెప్పింది. దాని వల్ల వృత్తి బాధ్యతలు దెబ్బతినవని తేల్చిచెప్పింది. ఆ కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెల్లడించింది.  అతని మృతి కచ్చితంగా పని ప్రదేశంలో జరిగిన ప్రమాదంగానే గుర్తించాలని చెప్పింది.