కండోమ్ కొనడానికి సిగ్గేసి.. ప్లాస్టిక్ కవర్ తో..
ఓ జంట కండోమ్ కొనడానికి సిగ్గుగా అనిపించి.. ప్లాస్టిక్ కవర్ ని వాడారు. చివరకు నానా అవస్థలు పడ్డారు.
సురక్షిత శృంగారానికి కండోమ్ వాడమని ప్రభుత్వాలే చెబుతుంటాయి. ప్రజల్లో సెక్స్ నాలెడ్జ్ నింపడానికి.. స్కూల్ వయసులోనే పాఠాలు బోధిస్తున్న రోజులివి. అలాంటిది.. ఓ జంట కండోమ్ కొనడానికి సిగ్గుగా అనిపించి.. ప్లాస్టిక్ కవర్ ని వాడారు. చివరకు నానా అవస్థలు పడ్డారు. ఈ సంఘటన వియత్నాంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయత్నాంకి చెందిన ఓ జంట.. సెక్స్ లో పాల్గొనాలని అనుకున్నారు. ముందుగా కండోమ్ కొనాలని భావించారు. అయితే..దుకాణానికి వెళ్లి.. కండోమ్ కావాలి అని అడగాలంటే వారికి సిగ్గుగా అనిపించింది. అందుకు.. కండోమ్ బదులుగా ప్లాస్టిక్ కవర్ ని వినియోగించారు. ఆ తర్వాత వారికి అసలు సమస్య మొదలైంది. ముందు బాగానే ఉంది కదా అనుకున్నారు. కానీ ఆ తర్వాత చూసుకుంటే.. ఇద్దరికీ జననాంగాల్లో గాయాలయ్యాయి.
వెంటనే.. ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లు వీరు చేసిన నిర్వాకం విని ఆశ్చర్యపోయారు. ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయవద్దని హితవు పలికి.. మందులు రాసిచ్చారు. ఈ జంట మాత్రమే కాదు.. వియత్నాంలో చాలా మందికి సెక్స్ పట్ల సరైన నాలెడ్జ్ లేదని ఓ సర్వేలో తేలింది. ఓ మెడికల్ సంస్థ చేపట్టిన సర్వేలో 2,700మంది విద్యార్థులను కండోమ్ వినియోగం గురించి ప్రశ్నించారట.
చాలా తక్కువ మంది మాత్రమే కండోమ్ వినియోగించామని చెప్పగా.. మిగిలినవారు.. తమకు కండోమ్ కొనాలంటే సిగ్గు అని చెప్పడం గమనార్హం.