ఇప్పటి వరకు మీరు చాలా రియాల్టీ షోలు చూసి ఉండొచ్చు. కానీ.. ఈ రియాల్టీ షో మాత్రం చాలా భిన్నం. ఈ షోలో పాల్గొనే జంటలు.. కెమేరా ముందే శృంగారంలో పాల్గొంటారు. వాటిని షో యాజమాన్యం వీడియో తీసి.. వారు సెక్స్ ఎలా చేస్తున్నారో పరిశీలించి మరీ వారికి కొన్ని సూచనలు చేస్తారు. అక్కడితో ఆగదు.. దాన్నంతటినీ టీవీలో కూడా టెలీకాస్ట్ చేస్తారు. ఈ షో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే... పెళ్లి జరిగిన  తొలినాళ్లలో దంపతులు చాలా ఆనందంగా ఉంటారు. సంవత్సరాలు గడిచినకొద్ది.. సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. చాలా మంది యాంత్రికంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి జంటలను ఎంపికచేసి.. వారి సెక్సువల్ జీవితాన్ని మళ్లీ ఆనందంగా గడపడానికి ఏం చేయాలో సూచనలు ఇవ్వాలనుకున్నారు. దానిని ఓ ప్రోగ్రామ్ గా డిజైన్ చేశారు.

చానల్ 4 అనే టీవీ ఛానల్ సెక్స్ టేప్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బలవంతం ఏమీలేకుండా ఈ షోలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకుంటే.. వారికి ఛాన్స్ ఇస్తారు. వారి రతిక్రీడను పరిశీలించి.. తగిన సూచనలు చేస్తారు. ఈ షోలో పాల్గొనడానికి చాలా మంది జంటలు ఉత్సాహం చూపించడం గమనార్హం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఈ విధంగా చేస్తుండటం విశేషం.