సెక్స్ గురించి ఆలోచనలు వారికే ఎందుకు ఎక్కువ..?

 అందుకే తరచుగా పురుషుడే ఎక్కువగా స్త్రీని అనుసరిస్తుంటాడు. వీటన్నింటి వల్లా పురుషుల్లో కామ వాంఛలు కొంత ఎక్కువనే చెప్పొచ్చు. అయితే దీనర్థం పురుషులు చెడ్డవారనీ, స్త్రీలు మంచివారనీ కాదు

boys always thinking about sex compare to girls reason is here

స్త్రీలతో పోలిస్తే.. పురుషులకి సెక్స్ గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా వరకూ నిజమే. ఇదేదో పురుషుల మీద లేనిపోని ముద్ర వెయ్యటం వంటిదేం కాదు. దీని వెనక జీవభౌతిక, శారీరక కారణాలున్నాయి. స్త్రీలలోనైనా, పురుషుల్లోనైనా లైంగిక వాంఛలకు మూలం ‘టెస్టోస్టిరాన్‌’  హార్మోను! పురుషుల్లో ఇదే ప్రధాన హార్మోను. కానీ స్త్రీల విషయానికి వచ్చే సరికి వారిలో స్త్రీ హార్మోన్లైన ప్రొజెస్టిరాన్‌, ఈస్ట్రోజెన్‌లు ఎక్కువగానూ, ఈ టెస్టోస్టిరాన్‌ తక్కువగానూ ఉంటాయి. అందుకే సహజంగానే పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువ. 

రెండోది- టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి కూడా పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది వృషణాల్లోనూ, శరీర కండరాల్లో కూడా తయారవుతుంటుంది. పురుషుల్లో కండర పుష్టి ఎక్కువ కాబట్టి వీరిలో ఈ హార్మోను ఉత్పత్తీ ఎక్కువే. ఇక స్త్రీలలో ఉండే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు వారిలో మృదుత్వానికి, సాధు స్వభావానికి, సంతాన పరిరక్షణ, పరిపోషణలకు ఉపకరిస్తాయి.

అలాగే పరిణామ క్రమంలో చూసుకుంటే- మానవ జాతిలో కలయిక కోసం, పునరుత్పత్తి కోసం చొరవ తీసుకోవటమనేది పురుష లక్షణంగా అవతరించింది. అందుకే తరచుగా పురుషుడే ఎక్కువగా స్త్రీని అనుసరిస్తుంటాడు. వీటన్నింటి వల్లా పురుషుల్లో కామ వాంఛలు కొంత ఎక్కువనే చెప్పొచ్చు. అయితే దీనర్థం పురుషులు చెడ్డవారనీ, స్త్రీలు మంచివారనీ కాదు.. దీన్ని లింగపరమైన ప్రకృతి సహజ స్వభావంగా అర్థం చేసుకోవటం అవసరం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios