పరిగడుపున కలబంద రసం తాగితే ఏమౌతుంది?
కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చు. అయితే కొంతమంది పొద్దు పొద్దున్నే పరిగడుపున కలబంద రసానని తాగుతుంటారు. ఇలా తాగితే ఏమౌతుందో తెలుసా?
రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడం వరకు.. కలబంద ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కలబంద జ్యూస్ ను ఉదయం పరిగడుపున తాగితే మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఖాళీ కడుపుతో కలబంద రసం తాగే వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జీర్ణ ఆరోగ్యం: కలబందలో మన జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. అంతేకాదు ఈ జ్యూస్ లో చక్కెరలను, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే ఎంజైమ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ అజీర్ణం సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
హైడ్రేషన్: ఉదయాన్నే పరిగడుపున కలబంద రసాన్ని తాగడం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఈ రసంలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని పరిగడుపున తాగడం వల్ల మీ శరరీం హైడ్రేట్ గా ఉంటుంది.
నిర్విషీకరణ: కలబంద రసంలో నిర్విషీకరణ లక్షణాలు కూడా ఉంటాయని చెప్తారు. ఈ రసాన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ నుంచి విషాలు బయటకు పోయి మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక వ్యవస్థకు మద్దతు: కలబంద రసంలో ఎన్నో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడతాయి.
శోథ నిరోధక ప్రభావాలు: కలబంద రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఉదయం పరిగడుపున ఈ రసాన్ని తాగడం వల్ల వాపు, నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.
బ్లడ్ షుగర్ రెగ్యులేషన్: కలబంద రసం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి కూడా బాగా సహాయపడుతుంది. అంటే ఇది మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి లేదా డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.