Asianet News TeluguAsianet News Telugu

‘ఫేస్ ప్రైమర్‌ గా.. సెక్స్ ల్యూబ్...’ ఇదేం పిచ్చిపని అంటున్న నెటిజన్లు....

యూట్యూబర్స్, టిక్ టాకర్స్ చిత్ర విచిత్రమైన వీడియోలతో తమ ఫాలోవర్స్ ను ఆకట్టుకోవడానికి, పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీనికోసం దేనికైనా వెనకాడరు. అలా బ్యూటీ అంశాలను టిక్ టాక్ చేసే ఓ టిక్ టాకర్ ఊహించడానికి కూడా వీలుకాని ఓ ప్రాడక్ట్ ను బ్యూటీకోసం వాడొచ్చని సెలవిచ్చాడు.

Beauty TikTokers are using sex lubes as primer
Author
Hyderabad, First Published Oct 20, 2021, 3:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే చిత్రవిచిత్రంగా చేయాలి.. అనేదాన్నే ఫాలో అవుతారు చాలామంది. చెప్పాలంటే ఒక్కోసారి అలాంటివే వైరల్ అవుతుంటాయి కూడా. కొన్ని ఊహించని విషయాలు..ఎవ్వరూ అనుకోని వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. వైరల్ గా మారి రాత్రికి రాత్రి సదరు వ్యక్తుల్ని సెలబ్రిటీలుగా మార్చేస్తాయి.

అందుకే  యూట్యూబర్స్, టిక్ టాకర్స్ చిత్ర విచిత్రమైన వీడియోలతో తమ ఫాలోవర్స్ ను ఆకట్టుకోవడానికి, పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీనికోసం దేనికైనా వెనకాడరు. అలా బ్యూటీ అంశాలను టిక్ టాక్ చేసే ఓ టిక్ టాకర్ ఊహించడానికి కూడా వీలుకాని ఓ ప్రాడక్ట్ ను బ్యూటీకోసం వాడొచ్చని సెలవిచ్చాడు.

Beauty TikTokers are using sex lubes as primer

దీంతో ఇప్పుడు ఈ విషయం Social mediaలో హల్ చల్ గా మారింది. టిక్‌టాక్‌లోని కొంతమంది బ్యూటీ బ్లాగర్లు ఫేస్ ప్రైమర్‌ని sex lubesతో భర్తీ చేయచ్చని చెబుతున్నారు. దీన్ని ముఖాలకు అప్లై చేయడం వల్ల చల్లగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

మృదువైన చర్మం కోసం ఈ beauty TikTokers తమ ముఖానికి ల్యూబ్‌ను ప్రైమర్‌లుగా అప్లై చేయడం కనిపిస్తుంది. ఈ వీడియో 7.9 మిలియన్లకు పైగా మంది చూశారు. అంతేకాదు ఈ ట్రెండ్ రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగిపోతోంది. 

Beauty TikTokers are using sex lubes as primer

దీన్ని ప్రమాదకర పరిణామంగా dermatologistsలు పేర్కొంటున్నారు. ముఖానికి పెట్టుకుంటే చల్లగా అనిపించినప్పటికీ,  జననేంద్రియాలపై ఉపయోగించే lubeని ముఖానికిఅప్లై చేయడం కూడా ప్రమాదకర అని చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. వీరి ప్రకారం, ముఖం మీద ల్యూబ్‌ను ఉపయోగించడం వల్ల మొటిమలు ఉన్నవారికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. 

ఈ సెక్స్ ల్యూబర్స్ ను శృంగారంలో లూబ్రికెంట్ గా వాడతారు. వీటిని ముఖానికి వాడడం విచిత్రమైన, వింతైన పర్ వర్షన్ అని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా వ్యూస్ కోసం దేన్ని బడితే దాన్ని వాడడం అంత మంచిది కాదని చెబుతున్నారు. ఇలాంటి సంఘటను ఇది వరలో కూడా చాలా చోటు చేసుకున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. 

Beauty TikTokers are using sex lubes as primer

గతంలో అత్యంత శక్తివంతమైన Gorilla Glueతో ప్రయోగాలు చేయబోయి మొదటికే మోసం తెచ్చుకుందో యువతి. టెస్సికా బ్రౌన్ అనే ఓ అమ్మాయి హెయిర్ స్టైల్ ప్రయోగం చేద్దామని గొరిల్లా గ్లూను తలకు రుద్దుకుంది. అంతే జుట్టు తలకు అతుక్కుపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా గ్లూ పోలేదు. 

దీంతో బయపడి ఆస్పత్రికి వెడితే డాక్లర్లు ఆమె తలకు అంటుకున్న గ్లూను తీసేశారు. అయితే దీనికోసం ఆమె జుట్టు మొత్తం తీసేయాల్సి వచ్చింది. అంతేకాదు చికిత్సకు 12వేల డాలర్లకు పైగా ఖర్చయ్యింది. తన దీనస్థితిని చెబుతూ టెస్సికా నెటిజన్స్ ను ఆర్థిక సాయం కోరింది. వైద్య ఖర్చులకు సాయపడాల్సిందిగా అర్థించింది. అయితే లెన్ మార్టిన్ అనే నెటిజన్ టెస్సికా అబద్ధం చెబుతుందని కామెంట్ చేశాడు. అంతేకాదు అది ఈజీగా తుడుచుకోవచ్చని చెప్పాడు. కావాలంటే ఆ గ్లూను తాను వాడి చూపిస్తానన్నాడు.

Beauty TikTokers are using sex lubes as primer

అది ప్రూవ్ చేయడానికి ఓ ప్లాస్టిక్ బాటిల్ కు గ్లూ అంటించి దాన్ని తన పెదాలకు పెట్టుకున్నాడు. అంతే అది అలా అతుక్కుపోయింది. ఇంక ఎంతకీ రాలేదు. దీంతో మార్టిన్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. విషయం ఏంటంటే ఆ గ్లూ తీయడానికి మార్టిన్ పెదాలు తీసేయాల్సి రావడం ఇక్కడ కొసమెరుపు. 

ఇలాంటి ప్రమాదమే ఈ సెక్స్ ల్యూబ్స్ తో జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ల్యూబ్‌లో castor oil ఉంటుంది, దీనికి చర్మ రంధ్రాలను మూసివేసే లక్షణం ఉంటుంది. అందువల్ల, ఈ పిచ్చి ధోరణిని ఇంట్లో ప్రయత్నించవద్దని వారు వ్యూయర్స్ ను కోరుతున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే హెచ్చరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios