Asianet News TeluguAsianet News Telugu

వర్షాకాలంలో ఆ సమస్యలకు ‘వేప’తో చెక్

వేప ఆకుల చూర్ణాన్ని తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. జుట్టు బలంగా అవుతుంది. జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.

Beat Monsoons Woes With The Power Of Neem!

వేపలో ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది షుగర్ పేషెంట్స్ కూడా వేప చిగురును తింటూ ఉంటారు.. షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి. కేవలం ఆ ఒక్కదానికే కాదు.. చర్మ, కేశ సౌందర్యానికి కూడా వేప చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వర్షకాలంలో ఎదురయ్యే కొన్ని సమస్యలకు వేపతో చెక్ చెప్పేయొచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఒకసారి చూసేద్దామా...

చర్మరక్షణకు...వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి. ఇవి ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలను, మొటిమలను నివారిస్తాయి. వర్షాకాలంలో దద్దుర్లు, దురద, మంటతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారి నుంచీ చర్మానికి రక్షణ కల్పిస్తాయి.
 Beat Monsoons Woes With The Power Of Neem!
చుండ్రుకు చెక్‌: వర్షాకాలంలో తలలో పీహెచ్‌ సమతుల్యత దెబ్బతిని జుట్టు ఆయిలీగా, జిడ్డుగా తయారవుతుంది. ఫలితంగా చుండ్రు పెరుగుతుంది. ఇలా చుండ్రుతో బాధపడు తున్నవారు వేప ఆకుల చూర్ణాన్ని తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. జుట్టు బలంగా అవుతుంది. జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.
 
రక్తాన్ని శుద్ధిచేస్తుంది: వేపలో సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధిచేయడంలో తోడ్పడుతాయి. కాలేయం, మూత్రపిండాల నుంచి వ్యర్థపదార్థాలను, హానికర పదార్థాలను బయటకు పంపించడంలోనూ సహాయపడుతాయి. రోజూ కొద్ది మోతాదులో వేప కషాయాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవడమే కాకుండా రక్తంలో చక్కెర నిల్వలు, బీపీ కూడా నియంత్రణలో ఉంటాయి.
 
జీర్ణవ్యవస్థ పనితీరులో: కడుపులో దేవినట్లవడం, తేన్పులు రావడం వంటి సమస్యలతో బాధ పడుతున్నవారు వేప కషాయాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
 
చిగుళ్ల రక్షణలో: చాలా టూత్‌పేస్టులలో, మౌత్‌వాష్‌లలో వేప ఉంటున్న విషయం తెలిసిందే. వర్షాకాలంలో చల్లటి గాలుల వల్ల దంతాలు సున్నితంగా మారుతాయి. అయితే వేపలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నిరోధించడమే కాకుండా చిగుళ్లకు సంబంధించిన ఇతర సమస్యలను నివారిస్తాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios