అతి తక్కువ ఖర్చుతో అందరికీ లభించే పండు అరటి. కాలంతో సంబంధం లేకుండా లభిస్తుంది.  సులభంగా దొరికే ఈ పండులో పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి. చాలా మంది అరటి పండు తింటే బరువు పెరుగుతామని భావిస్తుంటారు. అయితే... నిజానికి అరటి పండు తింటే బరువు సులభంగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పూర్తిగా పండిన అరటి కాకుండా.. కాస్త గట్టిగా ఉన్న అరటి పండు తింటే... కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుందట. దీంతో.. త్వరగా ఆకలికాదని.. తద్వారా బరువు సులభంగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా పక్వానికి రాని అరటి పండ్లలో రెసిస్టెంట్ స్కార్చ్ ఎక్కువగా ఉంటుంది. అది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

ఇక బరువు తగ్గేందుకు  జిమ్ లో కసరత్తులు చేసే వారు కచ్చితంగా అరటి పండు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కసరత్తులు చేసేవారు అరటి పండు తీసుకుంటే కండరాలు రిలాక్స్ అవుతాయని... తిమ్మిర్లు లాంటివి పట్టకుండా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు.. వెంటనే శరీరానికి శక్తిని ఇవ్వడంలో అరటి ప్రధాన పాత్ర పోషిస్తుంది.