మహేష్ హీరోయిన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన సెక్స్ టాయ్స్ అమ్మకాలు

First Published 19, Jul 2018, 2:57 PM IST
After Kiara Advani, Swara Bhasker's masturbation scene, sale of sex toys for women in India rose by 44%
Highlights

ఈ సినిమాలు విడుదలైన తర్వాత సెక్స్ టాయ్స్ వినియోగం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. రికార్డ్స్ ప్రకారం.. గత నెల జూన్ లో రూ.2కోట్లకు పైగా విలువచేసే సెక్స్ టాయ్స్ అమ్మకాలు జరగగా.. అందులో రూ.1.20కోట్ల అమ్మకాలు స్త్రీలే జరిపినట్లు తెలుస్తోంది. 

ఇండియాలో సెక్స్ టాయ్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అది కూడా అమ్మాయిల్లో. మీరు చదివింది నిజమే.. అమ్మాయిల్లో సెక్స్ టాయ్స్ కొనేవారి సంఖ్య 44శాతానికి పెరిగింది. దీనికి కారణం బాలీవుడ్ హీరోయిన్లు కైరా అడ్వానీ, స్వరా భాస్కర్.

సెక్స్ టాయ్స్ అమ్మకాలు పెరగడానికి.. ఈ ఇద్దరు హీరోయిన్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? ఉంది. తెలుగులో మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాలో నటించిన కైరా అడ్వాని.. హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ‘లస్ట్ స్టోరీస్’ పేరిట నెట్ ఫ్లిక్ లో విడుదలైన ఈ వెబ్ వర్షన్ లో కైరా ప్రధాన పాత్ర పోషించింది..

ఇందులో కైరా సెక్స్ టాయ్ ని వినియోగించే సీన్ ఒకటి ఉంది. అది బాగా పాపులర్ అయ్యింది కూడా. అంతేకాదు. నటి స్వరా భాస్కర్ కూడా ‘ వీర్ దే వెడ్డింగ్’ సినిమాలో సెక్స్ టాయ్ ని వినియోగించినట్లు చూపించారు.

ఈ సినిమాలు విడుదలైన తర్వాత సెక్స్ టాయ్స్ వినియోగం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. రికార్డ్స్ ప్రకారం.. గత నెల జూన్ లో రూ.2కోట్లకు పైగా విలువచేసే సెక్స్ టాయ్స్ అమ్మకాలు జరగగా.. అందులో రూ.1.20కోట్ల అమ్మకాలు స్త్రీలే జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నెల నుంచి మే నెల వరకు సెక్స్ టాయ్స్ మొత్తం జరిపిన అమ్మకాలు రూ.7కోట్లు కాగా.. కేవలం ఈ ఇద్దరు హీరోయిన్ల కారణంగా జూన్ ఒక్క నెలలోనే రూ.2కోట్ల వ్యాపారం జరిగింది. 

ఈ అమ్మకాలను బట్టి చూస్తే.. చాలా మంది స్త్రీలు లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

loader