తన వీర్యాన్ని తానే సూదితో ఎక్కించుకున్నాడు.. చివరకి
18నెలల పాటు తన వీర్యాన్ని తానే స్వయంగా సూదితో ఎక్కించుకున్నాడు.
చాలా మంది జ్వరం, ఒంటి నొప్పులు లాంటివి వస్తే... డాక్టర్ ని సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు. ఆ సొంత వైద్యం వికటించి చివరకు ఆస్పత్రులపాలౌతూ ఉంటారు. తాజాగా.. ఇలానే ఓ వ్యక్తి నడుంనొప్పికి ఎవరో చెప్పిన వింత వైద్యం చేసుకొని అనారోగ్యం బారిన పడ్డాడు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా.. తన వీర్యాన్ని తానే ఎక్కించుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే... 33ఏళ్ల ఓ యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. ఎన్నోరకాల మందులు వాడినా.. నొప్పి నుంచి ఉపశమనం మాత్రం లభించలేదు. దీంతో.. వీర్యాన్ని సూది ద్వారా శరీరంలోకి ఎక్కిస్తే.. నొప్పి తగ్గుతుందని ఎవరో చెప్పడం విని దానిని ఫాలో అయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18నెలలు ఈ విధంగా చేశాడు.
ఒకరోజు జిమ్ లో వ్యాయామం చేస్తుండగా.. నడుం నొప్పి మరింత తీవ్రతరం అయ్యింది. అతని చెయ్యి కూడా వాచిపోయింది. దీంతో.. అతనిని పరిశీలించిన వైద్యులు చేతిలో వీర్యం ఉండటాన్ని గమనించారు. దీనిపై అతనిని ప్రశ్నించగా.. నడుం నొప్పి తగ్గుతుందని అలా చేశానని చెప్పడంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతు అయ్యింది.
ఆ వీర్యం అలానే అతని శరీరంలో ఉంటే.. మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని.. కొంత మేర దానిని తొలగించారు. అనంతరం అతనికి యాంటీ బయాటిక్స్ ఇచ్చారు.