Asianet News TeluguAsianet News Telugu

ప్లాస్టిక్‌కు సొగసైన ప్రత్యామ్నాయాలిలా..!!

పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన తమ జీవితంలో అడుగడుగునా ప్లాస్టిక్ వినియోగాన్ని తప్పించాలని ప్రపంచ జనాభా యావత్ తుది నిర్ణయానికి వచ్చింది. తద్వారా పరిశుభ్రమైన గ్రీనరీ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. 

5 Smart Alternatives To Use Instead Of Plastic Skip plastic with these cleaner and greener substitutes

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో రోజూ ప్రతి పనికి ప్లాస్టిక్ కవర్ వాడకం తప్పనిసరిగా మారింది. కానీ పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన తమ జీవితంలో అడుగడుగునా ప్లాస్టిక్ వినియోగాన్ని తప్పించాలని ప్రపంచ జనాభా యావత్ తుది నిర్ణయానికి వచ్చింది. తద్వారా పరిశుభ్రమైన గ్రీనరీ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతిమాతపై భారం తగ్గించడానికి ప్లాస్టిక్ కంటైనర్‌కు బదులు ఐదు సొగసైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. 

త్వరితగతిన భోజనం తయారు చేసుకోవడానికి అవసరమైన ప్లాస్టిక్ కత్తి వాడకానికి బదులు సొగసుగా చెక్క కత్తిపీట వాడొచ్చు. రోజువారీ సామాన్ల కోసం కిరాణం దుకాణానికి వెళితే సామాన్లతో ప్లాస్టిక్ బ్యాంగ్ ఇస్తే తిరస్కరించండి. దానికి బదులు పలుచని వస్త్రంతో తయారు చేసిన పౌచెస్ వాడండి. పలుచని ఫ్యాబ్రిక్ సంచితో తేలిగ్గా మీ వస్తువులను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఫ్రిడ్జిలో వస్తువులను తాజాగా ఉంచొచ్చు. 

2018లో డిస్పోజబుల్ వాటర్ బాటిళ్లు కొనుగోళ్లు చేయడానికి ప్రభుత్వాలు అనుమతించడం లేదు. వీటికి బదులు గ్లాస్ బాటిళ్లు ఉపయగించాలని సూచిస్తున్నారు. పునర్వినియోగానికి వీలుగా ఉండే గ్లాస్ బాటిళ్లు వాడుకోవాలని సూచిస్తున్నారు. పలు కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇళ్లలో గల వాటర్ కూలర్లలో కూడా పునర్వినియోగానికి వీలైన గ్లాస్ బాటిళ్లు వాడాలని చెబుతున్నారు.

మాల్‌కు వెళ్లిన ప్రతిసారి ఇంట్లోకి అవసరమైన వస్తువుల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ అదనంగా బ్యాగ్ కొనుగోలు కోసం మాత్రం కొనుగోలు దారుల్లో స్పేస్ లేదు. ప్రతీసారి కాన్వాస్ బ్యాగ్ తీసుకెళ్లడానికి బదులు వివిధ రకాల వెరైటీతో కూడిన బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఏటా లక్షల టన్నుల కొద్దీ వ్రుథాగా పడవేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో ప్లాస్టిక్ స్ట్రాలు ఉన్నాయి. వాటికి బదులు మెటల్ స్ట్రాలను వాడటం ఉపయోగంగా ఉంటుంది. వాటిని వందల మంది శీతల పానీయాలను తాగడానికి వాడొచ్చు. కానీ వాటిని నిరంతరం శుభ్రపర్చాల్సిన అవసరం ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios