Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో మంటగలుస్తున్న మానవత్వం: చనిపోయిన వ్యక్తిని నడిరోడ్డుపై వదిలేసిన జనం

కరోనా కారణంగా భారతదేశంలో సామాజిక పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. తుమ్ములు, దగ్గు, నోటి వెంట తుంపరల కారణంగానే వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వాలు చెబుతుండటంతో దగ్గు, తుమ్ములు వున్న వారిని జనం అంటరానివారుగా చూస్తున్నారు.

man died in karimnagar, people not touched dead body
Author
Karimnagar, First Published Mar 25, 2020, 3:29 PM IST

కరోనా కారణంగా భారతదేశంలో సామాజిక పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. తుమ్ములు, దగ్గు, నోటి వెంట తుంపరల కారణంగానే వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వాలు చెబుతుండటంతో దగ్గు, తుమ్ములు వున్న వారిని జనం అంటరానివారుగా చూస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం కరోనాకు పుట్టినిల్లు చైనాలోని వుహాన్ నగరంలో జనం రోడ్లపై చనిపోయివారిని పట్టించుకున్న పాపాన పోలేదు. దగ్గరకి వెళితే తమకు ఏం జరుగుతుందోనని భయం. ఇప్పుడు అచ్చం అలాంటి సంఘటనే కరీంనగర్‌లో జరిగింది.

ఆదివారం నగరంలోని కశ్మీర్‌గడ్డ రైతు బజార్ వద్ద కూరగాయల కోసం వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అయితే కరోనా భయంతో స్థానికులు మృతదేహం వద్దకు వెళ్లడానికి  భయపడిపోయారు.

Also Read:తెలంగాణలో మరో మూడు కాంటాక్ట్ కేసులు: 39కి చేరిన కరోనా సంఖ్య

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రైతు బజార్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కొద్దిరోజుల క్రితం కరీంనగర్‌లో ఇండోనేషియాకు చెందినవారు సంచరించడం, వారందరికీ కరోనా పాజిటివ్‌ నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

తెలంగాణలో సోమవారంనాడు మరో మూడు కరోనా కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 39కి చేరుకుంది. సోమవారంనాడు ఒక్క రోజే ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 6 కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి.

సోమవారంనాడు నమోదైన కేసుల్లో మూడు కాంటాక్ట్ కేసులు కాగా, మూడు విదేశాల నుంచి వారి కేసులు. హైదరాబాదులోని మణికొండలో 64 వృద్ధురాలికి కోరనా అంటుకుంది. కాగా, కొత్తగూడెం డీఎస్పీ, ఆయన ఇంటి పనిమనిషి కరోనా బారిన పడ్డారు. 

విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు లండన్, జర్మనీ, సౌదీల నుంచి వచ్చారు. లండన్ నుంచి వచ్చిన హైదరాబాదు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇతను హైదరాబాదులోని కోకాపేటకు చెందినవాడు.

Also Read:వినకపోతే 24 గంటల కర్ఫ్యూ, అదీ కాకపోతే కనిపిస్తే కాల్చివేత: కేసీఆర్

జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. సౌదీ నుంచి వచ్ిచన 61 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంటాక్ట్ కేసులు నమోదు కావడంతో రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

సోమవారంనాడు మరో 9 కరోనా ఆనుమానిత కేసులను కూడా అధికారులు గుర్తించారు. వీరందరూ ఆస్పత్రుల్లో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. పోలీసుల సాయంతో లాక్ డౌన్ సంపూర్ణంగా అమలయ్యే విధంగా చూస్తున్నారు. అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమై లాక్ డౌన్ అమలుయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios