Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి: పరిహారం కోసం బంధువుల ధర్నా

 కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఆదివారం నాడు  తెల్లవారుజామున  జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పరిహరం చెల్లించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు

karimnagar road accident victim family members protest for compensation at hospital in karimnagar district
Author
Karimnagar, First Published Feb 9, 2020, 4:23 PM IST


కరీంనగర్:  కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఆదివారం నాడు  తెల్లవారుజామున  జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పరిహరం చెల్లించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబసభ్యులు ఆదివారం నాడు ఉదయం ధర్నాకు దిగారు.

also read;కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

ఈ ప్రమాదంలో మరణించిన వారిని కొడిమ్యాల మండలం పూడూర్ నివాసులుగా గుర్తించారు. టాటా ఏస్ వాహనం కరీంనగర్ నుండి పూడూర్ కు  వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. 

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మేడిపల్లి సత్యంతో పాటు పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మృతుల కుటుంబాలకు  పరిహరం అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ లారీ మంత్రి కమలాకర్ కు చెందిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు  ఆయన ఫోన్‌లో కలెక్టర్ ను కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios