కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తనకు కాకుండా ఇంకొకరికి మద్దతు తెలిపాడన్న కక్షతో అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ వెంకటేష్ ....శివ అనే యువకుని కత్తితో దాడి చేశారు..

ఈ దాడిలో శివ పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు నుండి  టిఆర్ఎస్ అభ్యర్థి ముద్రకొల వెంకటేష్, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి దివ్య పోటీ చేశారు. 

అయితే శివ అనే యువకుడు తనకు కాకుండా దివ్య కు మద్దతు తెలిపాడు. దీంతో కక్ష పెంచుకొన్న శివ ఇవాళ తెల్లవారుజామున శివపై కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఇది  గమనించిన స్థానికులు శివను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో శివ చికిత్స పొందుతున్నాడు. శివ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.   వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 కాగా గత రాత్రి కూడా టిఆర్ఎస్ కౌన్సిలర్ విజయ్ గెలుపొందాడన్న కక్షతో విజయ్ అన్న రాజు పై అదే వార్డులో పోటీచేసిన శేఖర్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన  24 గంటల్లోపే మరో సంఘటన చోటు చేసుకోవడం వేములవాడలో సర్వత్రా ఆందోళన నెలకొంది