Asianet News TeluguAsianet News Telugu

డిగ్రీ అర్హతతో పోలీస్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.40 వేల జీతం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ

 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) ఖాళీగా ఉన్న 159 ఉద్యోగాల భ‌ర్తీకి యూ‌పి‌ఎస్‌సి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త‌ క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

upsc capf ac 2021 recruitment notification released for 159 assistant commandant posts
Author
Hyderabad, First Published May 4, 2021, 5:06 PM IST

ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్న నిరుద్యోగుల కోసం యూ‌పి‌ఎస్‌సి ఉద్యోగ నోటిఫికేషన్ 2021 విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) ఖాళీ పోస్టుల భ‌ర్తీకి  ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

అర్హత, ఆస‌క్తిగల  అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 159 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు కూడా ఉన్నాయి.

అభ్య‌ర్థుల‌ ఎంపిక రాతప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా చేస్తారు. ప్రిలిమ్స్ ప‌రీక్ష పూర్తి చేసిన‌వారు ఫిజిక‌ల్ ఎఫిసియెన్సీ టెస్ట్ (పీఈటీ)కి అర్హ‌త‌ సాధిస్తారు. అందులో క్వాలిఫై అయిన‌వారిని ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానిస్తారు.

ఈ ప‌రీక్ష‌ను ఏడాదికి ఒక్క‌సారి మాత్ర‌మే నిర్వ‌హిస్తారు. అభ్యర్థులు మరింత పూర్తి సమాచారం లేదా వివరాలకు  అధికారిక వెబ్‌సైట్‌ https://upsc.gov.in/లో చూడవచ్చు.

మొత్తం ఖాళీ పోస్టులు: 159

బీఎస్ఎఫ్‌- 35, ఆర్‌పీఎఫ్‌- 36, సీఐఎస్ఎఫ్- 67, ఐటీబీపీ- 20, ఎస్ఎస్‌బీ- 1

also read బార్డర్ సెక్యూరిటి ఫోర్స్ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లయ్ చేసుకోవడానికి క్లిక్క్ చేయండి ...

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే 20 నుంచి25 ఏళ్ల లోపు వ‌య‌స్సు వారై ఉండాలి. నేపాల్‌, భూటాన్‌కు చెందిన‌వారు కూడా ఈ ప‌రీక్ష రాయ‌డానికి అర్హులు.

ఎంపిక ప్రక్రియ‌: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 16 ఏప్రిల్‌ 2021

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: 5 మే 2021

రాత‌ ప‌రీక్ష‌: 8 ఆగ‌స్టు 2021

అడ్మిట్ కార్డులు: జూలై చివ‌రి వారంలో విడుదల  చేస్తారు

అధికారిక వెబ్‌సైట్‌:https://upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/

Follow Us:
Download App:
  • android
  • ios