Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న వారికి మంచి ఛాన్స్.. నేటి నుండే ప్రారంభం.. వేంటనే అప్లయ్ చేసుకోండి

పోస్ట్  కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఏదైనా సమానమైన డిగ్రీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
 

SBI CBO Recruitment 2023: Application begins tomorrow! Check Eligibility, Salary-sak
Author
First Published Nov 22, 2023, 5:49 PM IST

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్  ఆఫీసర్ లేదా CBOల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,280 మంది అభ్యర్థులను నియమించుకోనుంది. ఆసక్తి అండ్  అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  sbi.co.inలో దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా  సమర్పించవచ్చు.

అర్హత

పోస్ట్  కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఏదైనా సమానమైన డిగ్రీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి

ఈ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అక్టోబర్ 31 నాటికి 21 ఏళ్లు పైబడి 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ

స్క్రీనింగ్ అండ్  ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22 నుండి ప్రారంభమవుతుంది అలాగే ప్రక్రియ ప్రారంభమైన రోజున  అప్లికేషన్ లింక్ అందుబాటులో ఉంటుంది.

స్టెప్ 1: https://bank.sbi/web/careers/current-openingsకు లాగిన్ చేయండి

స్టెప్ 2: క్రిందికి స్క్రోల్ చేసి, రిక్రూట్‌మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ అధికారులపై క్లిక్ చేయండి

స్టెప్ 3: అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయండి

స్టెప్ 4: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

దరఖాస్తు ఫీజు 

జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ క్యాటగిరికి చెందిన అభ్యర్థులు రూ. 750 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర SC/ST/PwBD క్యాటగిరికి చెందిన అభ్యర్థులు  ఫీజు చెల్లించకుండా మినహాయింపు ఉంటుంది.

అడ్మిట్ కార్డ్

దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత, జనవరి 2024లో అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్ జారీ చేయబడుతుంది అలాగే  అదే  నెలలో వ్రాత పరీక్ష కూడా నిర్వహించబడుతుంది.

జీతం

ఈ పోస్టుకి  ఎంపికైన అభ్యర్థులకు రూ. 36,000 ప్రాథమిక వేతనం అందించబడుతుంది. అభ్యర్థి DA, HRA/లీజు రెంటల్, CCA, మెడికల్ అండ్  ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios