Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగ మహిళల కోసం మార్చ్ 10న జాబ్‌మేళా...

 నిరుద్యోగ మహిళలకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మార్చి 10న జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ గైడెన్స్‌ బ్యూరో, మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ (యూఈఐ అండ్‌ జీబీ, ఎంసీసీ ) డిప్యూటీ చీఫ్‌ అధికారి రాము తెలిపారు.

job fair will be held on March 10 to provide employment for unemployed women in the private sector
Author
Hyderabad, First Published Mar 7, 2020, 1:54 PM IST

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని  నిరుద్యోగ మహిళలకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మార్చి 10న జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ గైడెన్స్‌ బ్యూరో, మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ (యూఈఐ అండ్‌ జీబీ, ఎంసీసీ ) డిప్యూటీ చీఫ్‌ అధికారి రాము తెలిపారు.

also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఖాళీలు…

2 ప్రైవేట్‌ కంపెనీల్లో సుమారు 200 ఉద్యోగాల ఎంపిక కోసం ఈ మేళాను నిర్వహించనున్నామని, ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, డిగ్రీ లేదా డిప్లొమా చదివిన మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు, అలాగే ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.

ఎంపికైన వారికి నెట్టూర్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, ఎన్‌బీఎస్‌ మ్యాన్‌పవర్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఆసక్తి గలవారు బయోడేటా, ధ్రువీకరణ పత్రాలతో సహా ఈ నెల 10న ఆర్ట్స్‌ కళాశాల భవనం ఎదురుగా, చీఫ్‌ వార్డెన్‌ బిల్డింగ్‌ పక్కన గల యూఈఐ అండ్‌ జీబీ, ఎంసీసీ నందు నిర్వహించే జాబ్‌మేళాకు హాజరుకావాలన్నారు. వివరాల కోసం 82476 56356, 82477 62909 నంబర్లను సంప్రదించాలన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios