Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఉద్యోగాల జాతర.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే.. వెంటనే అప్లయి చేసుకోండీ..

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 172  జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనుంది.
 

Job recruitments begins in Telangana state for 172 Junior Panchayat Secretary posts check District wise vacancy details here
Author
Hyderabad, First Published Sep 24, 2021, 2:46 PM IST

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న  నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఖాళీగా పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పోర్ట్స్ కోటా కింద 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18 నుంచి  ప్రారంభమైంది.

 దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 10. అయితే స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టును భర్తీ చేయనున్నారు కాబట్టి విద్యార్హతలతో పాటు  సంబంధిత క్రీడల్లో కూడా రాణించి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను http://www.tsprrecruitment.in/  అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 172
ఆదిలాబాద్- 6, భద్రాద్రి కొత్తగూడెం- 7, జగిత్యాల- 5, జనగాం- 4, జయశంకర్ భూపాలపల్లి, ములుగు- 6, జోగుళాంబ గద్వాల్‌- 3, కామారెడ్డి- 8, కరీంనగర్- 4, ఖమ్మం- 9, కొమరంభీమ్ ఆసిఫాబాద్- 4, మహబూబాబాద్- 7, మహబూబ్‌నగర్, నారాయణపేట- 10, మంచిర్యాల- 4, మెదక్- 6, నాగర్‌కర్నూల్- 6, నల్గొండ- 13, నిర్మల్- 6, నిజామాబాద్- 8, పెద్దపల్లి- 3, రాజన్న సిరిసిల్ల- 3, రంగారెడ్డి- 7, సంగారెడ్డి- 8, సిద్దిపేట- 6, సూర్యపేట- 6, వికారాబాద్- 8, వనపర్తి- 3, వరంగల్ రూరల్- 5, వరంగల్ అర్బన్- 1, యాదాద్రి భువనగిరి- 6

also read నీట్ ఎస్ఎస్ 2021 ఎగ్జామ్ ప్యాటర్న్ లో మార్పు.. కేంద్రం, ఎంసిఐ నుంచి స్పందన కోరిన సుప్రీం కోర్టు..

 ఖాళీ పోస్టులు: జూనియర్ పంచాయతీ సెక్రెటరీ
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
క్రీడార్హతలు: హాకీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ లాంటి క్రీడల్లో రాణించి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 44 ఏళ్లు. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ క్రీమీలేయర్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులకు రూ.400.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు రూ.28,719.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18 సెప్టెంబర్ 2021
దరఖాస్తులకు చివరి తేదీ: 8 అక్టోబర్  2021
అధికారిక వెబ్‌సైట్‌:https://epanchayat.telangana.gov.in/

Follow Us:
Download App:
  • android
  • ios