Asianet News TeluguAsianet News Telugu

Army Jobs: జస్ట్ 10వ తరగతి పాసైతే చాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, జీతం రూ.55,000 పై మాటే..ఎలా అప్లై చేయాలంటే

Govt Jobs: కేవలం పదో తరగతి మాత్రమే పాసయ్యారా, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కోసం సిద్ధంగా ఉంది. అంతేకాదు  రూ.55 వేల గరిష్ట వేతనం కూడా లభించే అవకాశం ఉంది. మరి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. 

Indian Army Group C Recruitment 2022 Notification Released 10th Pass Can Apply
Author
Hyderabad, First Published Mar 18, 2022, 4:42 PM IST

Indian Army Group C Recruitment 2022: ఆర్మీ పోస్టల్ సర్వీస్ వింగ్, బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి ఖాళీలకు అర్హులైన అభ్యర్థులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.  ఈ పోస్టుల కోసం 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా వాషర్‌మన్, గార్డనర్ పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు. దరఖాస్తును ఫైల్ చేయడానికి చివరి తేదీ 02 ఏప్రిల్ 2022. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో నిర్ణీత అర్హత, జీతం, ముఖ్యమైన తేదీలు ఇతర సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చు.

ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ 2022 (Indian Army Group C Recruitment 2022) వేతనం ఎంత:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మ్యాట్రిక్స్ లెవల్ 1 కింద నెలకు రూ. 18,000 నుంచి 56,900 వరకు జీతం ఆఫర్ చేస్తున్నారు.

ఇండియన్ ఆర్మీ గ్రూప్ C రిక్రూట్‌మెంట్ 2022 (Indian Army Group C Recruitment 2022) అవసరమైన విద్యార్హత:
ఆర్మీ పోస్టల్ సర్వీస్ వింగ్‌లోని ఈ గ్రూప్ సి పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ 2022 (Indian Army Group C Recruitment 2022) వయోపరిమితి:
ఈ రిక్రూట్‌మెంట్ కింద, ఈ పోస్టులకు అభ్యర్థి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గరిష్ట వయోపరిమితిలో OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల ప్రత్యేక సడలింపు అందుబాటులో ఉంది.

ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ 2022 (Indian Army Group C Recruitment 2022) ఎంపిక ప్రక్రియ: 
వాషర్ మ్యాన్, గార్డనర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

ఇండియన్ ఆర్మీ గ్రూప్ C రిక్రూట్‌మెంట్ 2022 (Indian Army Group C Recruitment 2022) కోసం ఎలా దరఖాస్తు చేయాలి
అభ్యర్థులు తమ దరఖాస్తును వింగ్ కమాండర్, APS వింగ్, బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ రెజిమెంటల్ సెంటర్ కాంప్టీ, జిల్లా - నాగ్‌పూర్, మహారాష్ట్ర - 441001 (Address:- Wing Commander, APS Wing, Brigade of the Guards Regimental Center Kempty, District Nagpur 441001) కు పంపాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios