Asianet News TeluguAsianet News Telugu

ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...అప్లై చేసుకోండీ.

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

andhrapradesh grama sachivalayam welfare and education assistant recruitment 2020
Author
Hyderabad, First Published Jan 27, 2020, 10:39 AM IST

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. రాత పరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయి. జనవరి 31తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఫీజు చెల్లింపు చివరి తేదీ జనవరి 30. మొత్తం ఉన్న  ఖాళీలు 97.

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు 

also read హైద‌రాబాద్‌ 'ఐఐటీ'లో భారిగా ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకోండీ.

జిల్లాల వారీగా ఉన్న  ఖాళీలు: శ్రీకాకుళం 27, విజయనగరం 14, విశాఖపట్నం  8, తూర్పు గోదావరి 14, పశ్చిమ గోదావరి 7,కృష్ణా 3, గుంటూరు 3, ప్రకాశం 7, చిత్తూరు 4, అనంతపురం 1, కర్నూలు 8, కడప 1.


అర్హతలు: ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాలీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. నాన్‌-లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు ప్రతి జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

also read AP Jobs : గ్రామ సచివాలయాల్లో 762 ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకోండీ...

దరఖాస్తు:  సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం: ఎంపికైనవారికి మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.15,000 ఇస్తారు. ప్రొబేషన్ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పనితీరు ఆధారంగా, నిబంధనల ప్రకారం వేతనం ఉంటుంది.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ 31.01.2020 దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేది 30.01.2020

Follow Us:
Download App:
  • android
  • ios