DRDO- GTRE Apprentice Recruitment 2022: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. వీరే అర్హులు..!

బెంగళూరులోని డీఆర్‌డీవో–గ్యాస్‌ టర్బైన్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌(జీటీఆర్‌ఈ)..వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 

DRDO GTRE Apprentice Recruitment 2022

బెంగళూరులోని డీఆర్‌డీవో-గ్యాస్‌ టర్బైన్స్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (GTRE) వివిధ విభాగాల్లోని అప్రెంటిస్‌ ఖాళీల (Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

మొత్తం ఖాళీల సంఖ్య: 150
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు–75, డిప్లొమా అప్రెంటిస్‌ ట్రెయినీలు–20, ఐటీఐ అప్రెంటిస్‌ ట్రెయినీలు–25, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు (జనరల్‌ స్ట్రీమ్‌)–30.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు 
విభాగాలు: మెకానికల్, ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, సివిల్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. 
స్టైపెండ్‌: నెలకి రూ.9000 చెల్లిస్తారు.

డిప్లొమా అప్రెంటిస్‌ ట్రెయినీలు: 
విభాగాలు:
మెకానికల్‌/ప్రొడక్షన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. 
స్టైపెండ్‌: నెలకి రూ.8000 చెల్లిస్తారు.

ఐటీఐ అప్రెంటిస్‌ ట్రెయినీలు: 
ట్రేడులు:
మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్‌ మెటల్‌ వర్కర్‌. 
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. 
స్టైపెండ్‌: నెలకి రూ.7000 చెల్లిస్తారు.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు(జనరల్‌ స్ట్రీమ్‌): 
విభాగాలు:
బీకాం, బీఎస్సీ, బీఏ. అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. 
స్టైపెండ్‌: నెలకి రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 14.03.2022

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios