Asianet News TeluguAsianet News Telugu

మహిళా రోగులపై వైద్యుడి లైంగిక వేధింపులు.. రూ.7 వేల కోట్లకు సెటిల్మెంట్..

మాజీ క్యాంపస్ గైనకాలజిస్ట్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వందలాది మంది మహిళలకు 1 బిలియన్ డాలర్లకు పైగా అంటే రూ. 7,246,00,00,000 చెల్లించడానికి కాలిఫోర్నియాలోని ఓ ఉన్నత విశ్వవిద్యాలయం అంగీకరించడం చర్చనీయాంశం అయ్యింది. 

USC to pay 1.1 billion dollers to settle decades of sex abuse claims against gynecologist - bsb
Author
Hyderabad, First Published Mar 26, 2021, 12:25 PM IST

మాజీ క్యాంపస్ గైనకాలజిస్ట్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వందలాది మంది మహిళలకు 1 బిలియన్ డాలర్లకు పైగా అంటే రూ. 7,246,00,00,000 చెల్లించడానికి కాలిఫోర్నియాలోని ఓ ఉన్నత విశ్వవిద్యాలయం అంగీకరించడం చర్చనీయాంశం అయ్యింది. 

ఈ విషయాన్ని బాధితుల తరఫు న్యాయవాది ఒకరు గురువారం మీడియాకు వెల్లడించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు లాస్ ఏంజెలిస్ కోర్టుకు తెలిపింది. గతంలో 2018లో ఫెడరల్ క్లాస్ చర్య ఫలితంగా ఇప్పటికే 215 మిలియన్ డాలర్లు చెల్లించింది.  

ఈ సందర్భంగా న్యాయవాది గ్లోరియా ఆల్రెడ్ మాట్లాడుతూ.. సివిల్ లిటిగేషన్ చరిత్రలో లైంగిక వేధింపుల కేసులో ఇంత భారీ మొత్తంలో చెల్లించడానికి అంగీకరించడం ఇదే మొదటిసారి.. అన్నారు. ఈ లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరంటే...

జార్జి టిండాల్ (74) అనే వ్యక్తి తన 30 యేళ్ల సర్వీసులో వందలమంది మహిళలను లైంగిక వేధింపులకు గురి చేశాడు. వీరిలో మైనర్ల నుంచి మధ్య వయసు మహిళల వరకు ఉన్నారు. మెడికల్ చెకప్ కోసం వచ్చిన ఆడవారిని టిండాల్ లైంగికంగా వేధించేవాడు. రోగుల ప్రైవేట్ పార్ట్స్ ని తాకడం, ఫొటోలు తీయడం, శరీరాకృతి విషయంలో ఇబ్బందికరంగా కామెంట్స్ చేసేవాడు. 

అంతేకాకుండా యూనివర్సిటీలో ఎక్కువగా  ఉన్న ఆసియాఖండం విద్యార్థులను టార్గెట్‌ చేసి వేధింపులకు పాల్పడేవాడు. 1990లో మొదటిసారిగా ఇతని అరాచకాలకు చెక్ పడింది. ఓ టీనేజ్ యువతి ఫిర్యాదుతో టిండాల్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. 

మెడికల్ చెకప్ కోసం వెడితే టిండాల్ తనను అసభ్యకరంగా తాకుతూ.. అత్యాచారం చేశాడని తెలిపింది.  అయితే యూనివర్సిటీ దీనిమీద ఏమీ స్పందించలేదు. దీంతో టిండాల్‌పై వచ్చిన ఆరోపణలపై రియాక్ట్ అవ్వడంలో ఫెయిలైనందుకు వేలాదిమంది మాజీ రోగులు యూనివర్సిటీపై కేసు వేశారు. 

అంతేకాదు వైద్యుడి ఈ చర్యల గురించి సంస్థకు బాగా తెలుసునని, అయినా కూడా అతడి మీద చర్యలు తీసుకోకుండా సర్వీసులో కొనసాగిస్తున్నారని బాధితులు ఆరోపించారు. పైగా 2016 వరకు యూఎస్ సీ అధికారులు టిండాల్ మీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయలేదని, నిందితుడికి విశ్వవిద్యాలయంతో ఉన్న స్నేహపూర్వక ఒప్పందం వల్ల టిండాల్‌ పదవీ విరమణ చేయడానికి అంగీకరించారని బాధితులు తెలిపారు. 

ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్ సీ ఇప్పటికే 200,000డాలర్లు చెల్లించినట్లు తెలిసింది. కొన్నిసార్లు అతడి వద్ద పరీక్షలకు హాజరైన నర్సులు టిండాల్ దుర్మార్గాలను ప్రత్యక్షంగా చూశారని న్యాయవాది తెలిపారు. 

బాధితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘యూఎస్ సీ హెల్త్ సెంటర్లో ఎన్నో వందల మంది మహిళలు ఏళ్ల తరబడి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్ సీ పలు తప్పుడు కథనాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. 

ఇవన్నీ అవాస్తవాలని మేం నిరూపించగలం. అలాగే తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను నేను అభినందిస్తున్నాను. వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానన్నారు. ఈ నేరం కనుక రుజువైతే టిండాల్‌ కు 53 ఏళ్ల పాటు జైళ్లో ఉంటాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios