Asianet News TeluguAsianet News Telugu

ఐ డ్రాప్స్ తో భర్తను చంపిన నర్సు: పాతికేళ్లు జైలు

ఐ డ్రాప్స్ తో ఓ నర్సు తన భర్తను చంపేసింది. ఈ సంఘటన ఆమెరికాలోని దక్షిణ కరోలినాలో చోటు చేసుకుంది. మంచినీటిలో కంటి మందు చుక్కలు కలిపి తాగించడంతో నర్సు భర్త చనిపోయాడు. దాంతో ఆమెకు పాతికేళ్ల జైలు శిక్ష పడింది.

US Nurse Poisons Husband To Death Using Eye Drops, Gets 25-Year Jail
Author
South Carolina, First Published Jan 17, 2020, 8:15 PM IST

హైదరాబాద్: ఐ డ్రాప్స్ తో ఓ మహిళ తన భర్తను చంపేసింది. రెండేళ్ల క్రితం చేసిన పనికి నర్సు జైలు పాలైంది. తన భర్తకు విషం ఇచ్చినట్లు ఆటాప్సీ రిపోర్టులో తేలడంతో కోర్టు ఆమెకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ సంఘటన అమెరికాలోని దక్షిణ కరోలినా ప్రాంతంలో జరిగింది.

దక్షిణ కరోలినా ప్రాంతానికి చెందన స్టీవెన్ క్లేటన్ (64), లానా స్యూ క్లేటన్ (53) భార్యాభర్తలు. లానా నర్సుగా పనిచేస్తోంది. ఆమె భర్త స్టీఫెన్ వాలంటరీ పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. వారిద్దరు కలిసి షార్లెట్ సమీపంలోని క్లోవర్ లో నివసిస్తున్నారు. 

2018 జులైలో ఆమె తన భర్త స్టీవెన్ కు మంచినీటిలో కంటి చుక్కల మందును కలిపి ఇచ్చినట్లు తెలిసింది. దాంతో అతను మరణించాడు. అయితే, మామూలుగానే అతను చనిపోయాడని తొలుత అందరూ భావించారు. అయితే అటాప్సీ రిపోర్టులో విష పదార్థం కలవడం వల్లనే స్టీవెన్ మరణించినట్లు తేలింది. 

స్టీవెన్ తాగిన నీటిలో టెట్రా హైడ్రోజిలిన్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల అతను మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు కనిపెట్టారు. దాంతో 2018 ఆగస్టులో పోలీసులు లానా క్లిటన్ పై కేసు నమోదు చేశారు. 

2016లోనూ లానా క్లిటన్ ను స్టీఫెన్ ను తల వెనక భాగంలో గొడ్డలితో కొట్టి చంపడానికి ప్రయత్నించడంతో పాటు దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు స్టీఫెన్ తరఫు న్యాయవాది ఆరోపించారు. 

సాక్ష్యాలన్నీ లానాకు వ్యతిరేకంగా ఉండడంతో తన బర్తను ఆమె ఉద్దేశ్యపూర్వకంగానే చంపినట్లు కోర్టు నిర్ధారించి ఆమెకు 25 ఏళ్ల జైలు శిక్ష వేసింది. తాను తన భర్తను చంపడానికి ప్రయత్నించలేదని, కేవలం అతన్ని మత్తులోకి తీసుకుని వెళ్లడానికి కంటి మందును కలిపి ఇచ్చానని లానా చెప్పింది. అది అతని ప్రాణం తీస్తుందని అనుకోలేదని కూడా చెప్పింది.  

Follow Us:
Download App:
  • android
  • ios