ఓ వ్యక్తికి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 1000 మందికి పైగా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంత మంది  గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ.. చాలా మంది మహిళలు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ నేరం కింద అతనికి న్యాయస్థానం 1075 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన టర్కీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టర్కీకి చెందిన ఓ మత ప్రబోధకుడికి అక్కడి న్యాయస్థానం ఇటీవల ఏకంగా 1075 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మైనర్లపై లైంగిక దాడులు, మహిళలకు లైగింక వేధింపులు, గూఢచర్యం వంటి నేరాలకు పాల్పడినందుకు గాను అద్నన్ ఒక్తార్ అనే మత ప్రాచారుకుడికి కోర్టు ఈ శిక్ష విధించింది. కాగా.. విచారణ సందర్భంగా అద్నన్ వ్యాఖ్యలకు న్యాయమూర్తి కూడా షాకైపోయారు. తనకు వెయ్యికిపైగా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారందరినీ తాను పిల్లిపిల్లలు అని పిలుచుకుంటూ ఉంటానని ఒక్తర్ చెప్పుకొచ్చాడు. 

ఓక్తర్ ఓ టీవీ ఛానల్ కూడా నిర్విహిస్తూ అందులో ప్రవచనాలు చెప్పేవాడు. ఈ షోలల్లో కొన్ని సందర్భాల్లో అనేక మంది యువతులు ఒక్తర్ చుట్టూ నృత్యం చేస్తూ కనిపించేవారు. కాగా..2018లో ఆర్థిక నేరాలపై పోలీసులు ఒక్తర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 2016లో టర్కీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మరో మత ప్రబోధకుడు ఫతుల్లా గూలెన్‌కు ఒక్తర్ సహకరించినట్టు అక్కడి న్యాయస్థానం ధృవీకరించింది. కానీ..ఒక్తర్ మాత్రం ఇప్పటికీ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాడు.