భార్య మాటలకు దిగొచ్చిన ట్రంప్! అందరూ కలిసే ఉండొచ్చని ప్రకటన!

Trump Signs On Executive Order For Family Separation
Highlights

ట్రంప్ వ్యవహరిస్తున్న కఠిన వైఖరి పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఆయన నిర్ణయాన్ని తన సొంత భార్యే సమర్థించడం లేదు.

అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని అడ్డుకునేందుకు ట్రంప్ సర్కారు 'జీరో టోలరెన్స్' పేరిట కుటుంబాల నుండి పిల్లలను, తల్లిదండ్రులను వేరు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, ఈ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న కఠిన వైఖరి పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఆయన నిర్ణయాన్ని తన సొంత భార్యే సమర్థించడం లేదు. ఈ విషయంలో ఇంటిపోరు కూడా ఎక్కువ కావడంతో ట్రంప్ దిగొచ్చారు.

ఫ్యామిలీ సెపరేషన్‌ను ఎత్తివేస్తున్నామని, అందరూ కలిసే ఉండొచ్చని ట్రంప్ తాజాగా బుధవారం నాడు ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పాస్ చేశారు. 'జీరో టాలరెన్స్' విధానం పేరిట అమెరికా సరిహద్దుల వద్ద పిల్లలను తల్లిదండ్రుల నుంచి దూరం చేయడంపై విమర్శలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇందుకు కొన్ని నియమ నిబంధనలను కూడా నిర్దేశించారు.

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి విషయంలో ఇమిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయటంతో పాటుగా, వారి నేర చరిత్రను గుర్తించి అర్హులైన వారిని మాత్రమే దేశంలోకి అనుమతించనున్నారు. అప్పటి వరకూ వారి కుటుంబాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలోనే ఉంచనున్నారు. కాగా ఇదివరకే వేరుపడిన కుటుంబాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. 

loader