Asianet News TeluguAsianet News Telugu

మెక్సికో లో విషాదం.. హాట్ ఎయిర్ బెలూన్ లో ఎగిసిపడిన మంటలు.. ఇద్దరు మృతి.. (వీడియో)

మెక్సికోలో విషాదం జరిగింది. హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు అంటుకోవడంతో ఇద్దరు మరణించారు. మరో చిన్నారికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Tragedy in Mexico.. Fire broke out in hot air balloon.. Two died.. (Video)..ISR
Author
First Published Apr 2, 2023, 2:52 PM IST

మెక్సికో సిటీలోని టియోటిహువాకాన్ లో విషాదం చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు చెలరేగి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని మెక్సికో రాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఉదయం 8:40 గంటలకు అందులో చెలరేగిన మంటల వల్ల బెలూన్ కూలిపోయిందని, ఈ క్రమంలో ప్రయాణికులు కిందకి దూకారని, ఓ చిన్నారికి కాలిన గాయాలయ్యాయని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

Karnataka Election 2023: కర్ణాటకలో మోడీపైనే బీజేపీ ఆశలు.. కనీసం 20 మోడీ సభలు.. ఆ సవాళ్లను అధిగమించగలడా?

వివరాలు ఇలా ఉన్నాయి. మెక్సికో సిటీ సమీపంలోని టియోటిహుకాన్ పురావస్తు ప్రదేశం ఉంది. ఇది పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది. దీంతో ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ లో పర్యాటకులు ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం కూడా ముగ్గురు పర్యాటకులతో ఓ హాట్ ఎయిర్ బెలూన్ గాలిలోకి ఎగిరింది. దీనిని కింద ఉన్న వ్యక్తులు వీడియో తీస్తున్నారు. అయితే ఒక్క సారిగా ఎయిర్ బెలూన్ కింద ఉన్న బకెట్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.

దీంతో అందులో ఉన్న ప్రయాణికులు కిందకు దూకారు. ఈ ప్రమాదంలో  39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఓ మైనర్ కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె కుడి తొడ ఎముక విరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి పేర్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించలేదు. వీరితో పాటు ఇంకా ఎవరైనా ఈ ప్రమాదంలో ఉన్నారా అనే వివరాలు తెలియరాలేదు. 

ప్రతిపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలి - మాజీ ప్రధాని దేవేగౌడ

కాగా.. ఈ విషాదం మొత్తం కెమెరాకు చిక్కింది. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. అందులో హాట్ ఎయిర్ బెలూన్ కు మంటలు అంటుకోవడం, పేలిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్న టియోటిహువాకాన్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి ప్రతీ సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios