Asianet News TeluguAsianet News Telugu

రేప్ కేసులు పెరుగుతున్నాయని ఎమర్జెన్సీ విధిస్తారటా..! పాకిస్తాన్ పంజాబ్ నిర్ణయం

పాకిస్తాన్‌లో రేప్ కేసులు పెరుగుతున్నాయని ఎమర్జెన్సీ విధించడానికి పాకిస్తాన్‌లోని పంజాబ్ నిర్ణయం తీసుకుంది. తమ ప్రావిన్స్‌లో రేప్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వీటిని డీల్ చేయడానికి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ ప్రావిన్స్ హోం మినిస్టర్ వెల్లడించారు.

to tackle rising rape cases pakistans punjab to declare emergency
Author
New Delhi, First Published Jun 22, 2022, 1:15 PM IST

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో మహిళలపై హింస పెచ్చుమీరిపోయింది. మహిళలు, చిన్నారులపై రేప్‌లు హద్దు మీరిపోయాయి. రోజుకు నాలుగు ఐదు ఘటనలైనా ఇలాంటివి ఒక్క పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోనే రిపోర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తున్నది. రేప్ కేసులు పెరుగుతున్నాయని, ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయం జరిగింది.

ఈ విషయంపై పంజాబ్ ప్రావిన్స్ హోం మంత్రి అట్టా తరార్ మాట్లాడారు. పంజాబ్ ప్రావిన్స్‌లో రోజుకు నాలుగు నుంచి ఐదు రేప్ కేసులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. రేప్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా ఉన్నదని అన్నారు. సమాజానికి, ప్రభుత్వ అధికారులనూ ఈ పరిణామం కలత పెడుతున్నదని వివరించారు.

పంజాబ్‌లో రేప్ కేసులు పెరుగుతుండటంతో వాటిని అరికట్టడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులను నివారించడానికి ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రేప్ కేసులను అరికట్టడానికి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. 

రేప్ కేసుల పెరుగుదల అంశంపై పౌర సంస్థలు, మహిళా హక్కుల సంస్థలు, ఉపాధ్యాయులు, అటార్నీలను కలిసి సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. వీటితోపాటు తల్లిదండ్రులు తమ పిల్లలను సంరక్షించుకోవాలని తెలిపారు. వారి సేఫ్టీ కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. రేప్ కేసులు, వేధింపుల కేసుల్లో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. స్కూల్‌లో హరాస్‌మెంట్ పై విద్యార్థులకు హెచ్చరికలు చేస్తామని తెలిపారు.

రేప్ కేసులను నివారించడాానికి రెండు వారాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 

పాకిస్తాన్‌లో లింగ వివక్ష ఎక్కువ. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2021లో పాకిస్తాన్ దారుణమైన ర్యాంకు పొందింది. మొత్తం 156 కంట్రీల నుంచి సర్వే నిర్వహించి సేకరించిన సమాచారాన్ని మధించి ర్యాంకింగ్స్ విడుదల చేశారు. ఇందులో ఇరాక్, యెమెన్, అఫ్ఝనిస్తాన్‌ల తర్వాత అత్యధికంగా యువత శక్తి మాత్రేమని తేల్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios